Rajamouli: మహేష్ బాబుకు కండిషన్స్ పెట్టిన రాజమౌళి.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా రిలీజ్ చేసి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఏకంగా పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుకి దిగ్గజ దర్శకుడు రాజమౌళి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అసలు విషయంలోకి వెళితే.. మహేష్ బాబు ఇకనుంచి పబ్లిక్ గా కనిపించడం కష్టమే అని తెలుస్తోంది.. ఎందుకంటే మహేష్ బాబు ఇకపై ఎలాంటి ఈవెంట్స్ కు ఫంక్షన్స్ కు హాజరు కాకూడదని డైరెక్టర్ రాజమౌళి ఆదేశాలు జారీ చేశారట.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.. మరి రాజమౌళి మహేష్ బాబుకు ఎందుకు ఇలాంటి కండిషన్ పెట్టారో ఇప్పుడు చూద్దాం..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు… ఆయన సినిమా వస్తోందంటే ఆయన అభిమానులకే కాదు సినీ లవర్స్ కి కూడా పెద్ద పండగే. మరోవైపు మహేష్ బాబు బయట కనిపించడం చాలా అరుదు.. అలాంటి ఈయనను ఇక అసలు బయట కనిపించకూడదని కండిషన్ లు పెట్టడంతో.. ఈ విషయం అభిమానులకు పూర్తిస్థాయిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే మహేష్ బాబుకి రాజమౌళి ఇలా కండిషన్స్ పెట్టడం వెనుక అసలు రీసన్ కూడా ఉందనే చెప్పాలి.. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా తన గెటప్ ని మార్చనున్నారు..అలాగే బాడీ బిల్డింగ్ కూడా చేయబోతున్నారు..ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు లుక్ జనాలకు తెలియకూడదని.. అందుకే మహేష్ బాబును పబ్లిక్ గా కనిపించవద్దని రాజమౌళి రూల్ పెట్టినట్లు తెలుస్తోంది.. ఇక మిగతా దర్శకులతో పోల్చుకుంటే రాజమౌళి వర్క్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. రాజమౌళి.. సినిమాలు తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు అందుకు తగ్గట్టుగానే హీరోల లుక్ ను కూడా మార్చేస్తూ ఉంటారు.. ఈ క్రమంలోనే మహేష్ బాబు లుక్ ని కూడా మార్చబోతున్నారట.. తన లుక్స్ కి తగ్గట్టుగానే మహేష్ బాబు విదేశాలకు వెళ్లి మరీ శిక్షణ పొందుతున్నాడు.

- Advertisement -

ముఖ్యంగా రాజమౌళి.. మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా దీన్ని తీర్చి దిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే మహేష్ బాబు లుక్ ను పూర్తిగా దాచేసి ఒకేసారి రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. మరి దీనికి అభిమానులు ఒప్పుకుంటారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం కూడా అభిమానులలో మరింత క్యూరియాసిటీని పెంచేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి చక్రవర్తి లేదా మహారాజా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మహేష్ బాబు సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ను ఖరారు చేసారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు