Mahesh babu : హిందీలోనూ దుమ్ములేపుతున్న ‘గుంటూరు కారం’..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ ఈ సంక్రాంతి కి థియేటర్లలో రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకుని కూడా 100 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని మహేష్ బాబు మాస్ రచ్చ ఎలా ఉంటుందో చూపించింది. ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయినా మహేష్ బాబు తన ఎనర్జీ తో తన మాస్ పెర్ఫార్మన్స్ తో జనాలని థియేటర్లకు రప్పించాడు. అప్పటికీ ఈ సినిమాకు 110 కోట్ల షేర్ వచ్చింది. అదే ఈ సినిమాకు కొంచెం హిట్ టాక్ వచ్చినా మరో 50 కోట్లయినా అదనంగా వచ్చి ఉండేవి. బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద పెద్ద నంబర్లు నమోదయ్యేవి.

అయితే ఓవరాల్ గా థియేటర్ రన్ పూర్తి అయ్యాక డిజిటల్ లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు రమణగాడు. రీసెంట్ గానే ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన గుంటూరు కారం అక్కడ సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపగా, రెండు వారాల్లో అక్కడ ఆల్ మోస్ట్ 5 మిలియన్స్ వరకు వ్యూస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా, తెలుగు తో పాటు సినిమా ఇతర సౌత్ భాషల్లో కూడా మాస్ రచ్చ చేస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ అవగా, హిందీ లో మాత్రం నెక్స్ట్ లెవల్ లో రచ్చ లేపుతుంది గుంటూరు కారం.

మొదటి వారంలో హిందీలో ఈ సినిమా కి 1.1 మిలియన్ వ్యూస్ సొంతం అవగా, రెండో వారంలో రెట్టించిన జోరు చూపించిన గుంటూరు కారం ఘాటు దెబ్బకి సినిమా ఏకంగా 1.8 మిలియన్స్ వరకు వ్యూస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ లేపుతూ ఎక్స్ లెంట్ గ్రోత్ ని చూపిస్తుంది. ఇక ఈ రేంజ్ లో హిందీలో గుంటూరు కారం సినిమా డబ్ వర్షన్ ఇలా ట్రెండ్ అవడం విశేషమనే చెప్పాలి. కాగా ఇతర దేశాల్లో కూడా సినిమా హిందీ వర్షన్ లోనే డిజిటల్ లో ట్రెండ్ అవుతూ ఉండటం మరింత విశేషం. దాంతో థియేటర్లో యావరేజ్ అయిన గుంటూరు కారం ఓటిటి లో సూపర్ హిట్ అవడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు