Indian 2 : భారతీయుడు2 నైజాం హక్కుల్ని సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!

లోక నాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం దర్శకత్వం లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్2 తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. తెలుగులో భారతీయుడు 2 పేరుతో విడుదల కానున్న ఈ సినిమా నాలుగేళ్ళ కిందటే మొదలైన షూటింగ్ పలు కారణాల వల్ల ఆగిపొయినా మళ్ళీ పట్టాలెక్కింది. ఇక ఈ సినిమా నుండి ఇది వరకు టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఇండియన్2 లో 1996 లో కొడుకుని చంపేసాక భారతీయుడు విదేశాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇండియా కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ లంచం అనే మహమ్మారి సోకి బాధపడుతూ ఇండియన్ మళ్ళీ ఏం చేసాడనేది ఈ “భారతీయుడు 2 లో చూపించబోతున్నారు.

ఇక భారతీయుడు 2 సినిమా ట్రైలర్ గాని, పాటలు గాని రిలీజ్ అవలేదు కానీ, అప్పుడే ఈ సినిమా అమ్మకాలు మొదలైపోయాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయుడు 2 డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ మొదలవగా, తాజాగా నైజాం హక్కులను ఏషియన్, సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తరఫున నిర్మాత సురేష్ బాబు, సునీల్ నారంగ్ లు సంయుక్తంగా కొన్నారు. ఇక ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంతకు కొన్నారన్న విషయంపై క్లారిటీ లేదు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం నైజాం రైట్స్ 10 నుండి 15 కోట్ల మధ్య ఉంటుందని టాక్.

ఇక భారతీయుడు 2 సినిమా రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు గాని, ఆగష్టు 15 విడుదల అయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. భారీ తరగణం నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్2 సినిమా రిలీజ్ అయితే కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రాదు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు