Indian2: “సేనాపతి” తిరిగొచ్చేశాడు! ఇక వేట మొదలు

లోక నాయకుడు కమల్ హాసన్ శంకర్ షణ్ముగం దర్శకత్వం లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే పాతికేళ్ల తరువాత శంకర్ కమల్ హాసన్ కాంబో లో దీనికి సీక్వెల్ గా ఇండియన్2 తెరకెక్కుస్తుంది. నాలుగేళ్ళ కిందటే మొదలైన ఈ సినిమా షూటింగ్ పలు కారణాల వల్ల ఆగిపొయినా మళ్ళీ పట్టాలెక్కింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ కాగా, చాలా నెలలకు వెయిట్ చేయించి ఎట్టకేలకు టీజర్ రిలీజ్ అయింది.

పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఇండియన్2 తెలుగులో భారతీయుడు2 పేరుతో రిలీజ్ చేస్తుండగా, అన్ని భాషల్లో పెద్ద పెద్ద స్టార్స్ తో టీజర్ రిలీజ్ చేయించగా, తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేయడం జరిగింది.

ఇక కాసేపటికిందటే రిలీజ్ అయిన ఇండియన్2 టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. టీజర్ లో 1996 లో కొడుకుని చంపేసాక భారతీయుడు విదేశాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇండియా కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ లంచం అనే మహమ్మారి సోకి బాధపడుతూ ఉంటే, చాలా మంది జనాలు అప్పుడే మళ్ళీ భారతీయుడు రావాలని, కం బ్యాక్ ఇండియన్ అంటూ నినాదాలు చేయడం టీజర్ లో చూపిస్తారు. అప్పుడే టీజర్ ఎండింగ్ లో ఇండియన్ తన పాత స్టైల్ లో “భారతీయుడు ఈజ్ బ్యాక్” అంటూ వచ్చేస్తాడు.

- Advertisement -

అయితే టీజర్ మొత్తం భారీ తారాగణం తో నిండిపోగా, ఆల్మోస్ట్ సినిమా కాన్సెప్ట్ టీజర్ ద్వారానే చెప్పేసినట్టయింది. ఇక అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా, టీజర్ కట్స్ యావరేజ్ గా ఉన్నాయి. ఇక లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఇండియన్2 సినిమాని 2024 లో రిలీజ్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు