NBK109 Movie Update: బాబీ కూడా బోయా మంత్రానే నమ్ముకున్నాడా?

బాలయ్యకు హిట్ ఇవ్వాలంటే… బోయపాటికే సాధ్యం. ఇది కొన్ని రోజుల మాట. ఇప్పుడు అనిల్ రావిపూడి వచ్చి ఈ మాటను తప్పు అని ప్రూవ్ చేసి, భగవంత్ కేసరి లాంటి హిట్ ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్టర్ బాబీ కూడా ఓ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ అనిల్ అయినా, ఇంక ఎవరైనా ఒకటి పాటించాల్సిందే.. అదే బోయా మంత్ర.

Read More: Balakrishna: భగవంత్ కేసరికి ఆ టైటిల్ పెట్టింటే… సీన్ మరోలా ఉండేదేమో!

సినిమా నిండా యాక్షన్ సీన్స్, హీరోకు కావాల్సినన్ని ఎలివేషన్ షాట్స్ ఇవి లేకుండా బాలయ్యతో సినిమా చేయలేని పరిస్థితి. ఇవి కాకుండా బాలయ్యతో వేరే జానర్ లో అనిల్ రావిపూడి సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. అనిల్ రావిపూడి స్టైల్ లో భగవంత్ కేసరి ఉన్నా… అందులో బోయా మంత్ర మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది. అంటే ఎలాంటి డైరెక్టర్ అయినా, బోయా మంత్రను ఫాలో అయితేనే… బాలయ్యకు హిట్ ఇస్తారు.

- Advertisement -

Read More: Nandamuri Balakrishna: హ్యాట్రిక్ హిట్స్ ఎఫెక్ట్… భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన బాలయ్య

 విషయాన్ని డైరెక్టర్ బాబీ కూడా గ్రహించినట్టు తెలుస్తుంది. అందుకే తన NBK109లో తన స్టైల్ ఉంటూనే బాలయ్య అభిమానులకు ఇష్టమైన బోయా మంత్రను కూడా చొప్పించాలని ప్లాన్ చేస్తున్నాడట. NBK109 సినిమా షూటింగ్ ను ఈ నెల 6వ తేదీ నుంచి స్టార్ట్ కానుంది. మొదటి షెడ్యూల్ మొత్తం యాక్షన్ సీన్స్ కే కేటాయించారట బాబీ. సినిమాలో హైలైట్ నిలవబోయే యాక్షన్ సీన్స్ ను ఫస్ట్ షూట్ చేసిన తర్వాతే… మిగితా పార్ట్ ను షూట్ చేయాలని చూస్తున్నాడట.

అంటే.. బాబీ కూడా తన సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కే ప్రధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి బాలయ్య సినిమాలో అభిమానులు కోరుకునేది కూడా అదే అని అందరికీ తెలుసు. అందుకే బోయాపాటి అయినా, అనిల్ రావిపూడి అయిన, నేడు బాబీ అయినా యాక్షన్ ఎపిసోడ్స్ కే హై ప్రియారిటీ ఇస్తున్నారని చెప్పొచ్చు.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు