Biggboss season7: గౌతమ్ శివాజీతో వాదించి తప్పు చేస్తున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ పూర్తవగానే వచ్చే వారం కెప్టెన్సీ టాస్క్ అప్పుడే మొదలైందన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు టాస్క్ లలో కంటెస్టెంట్స్ ముందుగా గ్రూప్ గా ఆడి, ఆ తర్వాత సోలో గేమ్స్ ఆడి కెప్టెన్ రేసులో గెలిచేవారు.

అయితే ఈ వారం మాత్రం కెప్టెన్సీ టాస్క్ మొదలై మూడు రోజులు గడుస్తున్నా గ్రూపులు గానే పోరాడామని బిగ్ బాస్ చెప్పాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ రేసు నుండి ఇప్పటికే ప్రశాంత్ తప్పుకోగా, తాజాగా భోలేని కూడా తప్పించి నట్టు తెలుస్తుంది. అయితే భోలేని తప్పించడం పై వచ్చే వారం నామినేషన్లలో తప్పకుండా ప్రస్తావించడం జరుగుతుందని చెప్పొచ్చు.

ముఖ్యంగా భోలే గౌతమ్ ని ఈ విషయంపై నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో శివాజీ తో గౌతమ్ వాగ్వాదం వైరల్ గా మారింది. ఇక్కడ ఇరు టీమ్ లు సంపాదించిన బాల్స్ విషయంలో శివాజీ తో ప్రియాంక చర్చిస్తుంటే, అనవసరంగా కలగచేసుకుని గౌతమ్ విషయాన్నీ పెద్దది చేస్తున్నాడని ఆడియన్స్ కి అనిపిస్తుంది.

- Advertisement -

అయితే గౌతమ్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన టైం లో కూడా శివాజీయే తనని గ్రూప్ తో కలిసి బయటికి పంపించారని అనుకుని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. మరి అప్పటి విషయాలు ఇంకా గుర్తు పెట్టుకుని శివాజీతో అనవసరంగా వాదించి తప్పు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు