Bigg boss Divi: బ్రేకప్ గురించి అసలు మేటర్ లీక్ చేసిన దివి..!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ షో తెలుగులో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.. ముఖ్యంగా పాజిటివ్ నెగిటివ్ ఎలా అయినా సరే ఈ షో ద్వారా చాలామంది గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలా నాల్గవ సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు అమ్మాయి దివి.. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు, సీరీస్ లు అంటూ బిజీగా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి.. తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్ అయింది.. ఇకపోతే తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి దివి మాట్లాడుతూ.. ఎమోషనల్ అవడం అభిమానులకు కంటతడి తెప్పిస్తోందని చెప్పవచ్చు.

బీటెక్ చదివే రోజులలో మేము ప్రేమించుకున్నాము.. ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్ లోనే ఉన్నాము. ఇక పెద్దలతో మాట్లాడి తర్వాత మా పెళ్ళికి కూడా ఒప్పించాము.. ముహూర్తం కూడా పెట్టుకున్నాం.. కానీ ఇంతలోనే అతడు తమ్ముడు అనారోగ్య సమస్యలతో చనిపోయాడు.. అయితే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నా కళ్ళ ముందే చనిపోయాడు.. ఎందుకంటే అతడు చివరి రోజుల్లో నేను పక్కనే ఉన్నాను.. అలా అని చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లి చివరి కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్ కి తోడుగా ఉన్నాను.. ఇక ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరులోనే తన తల్లిదండ్రులకు తోడుగా ఉండిపోయారు.. నేను ఇక్కడ హైదరాబాదులో ఉండాల్సి వచ్చింది.. దాంతో ఇద్దరం విడిపోయాము..

అయితే తనతోపాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్ళిపోతే నా కెరీర్ నాశనం అవుతుందని అనుకున్నాడు.. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది.. ఒకవేళ ఇది ముందే తెలిసి ఉంటే అతడితో పాటు నేను కూడా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయే దాన్ని.. అలా వారి తల్లిదండ్రుల కోసం నేను కూడా అండగా ఉండాలని అనుకున్నాను.. కానీ ఈ విషయం నాకు చెప్పకుండా నా నుంచి విడిపోయాడు అంటూ ఎమోషనల్ గా కామెంట్లు చేసింది దివి ..మొత్తానికైతే తన ట్రాజెడీ ప్రేమ కథ గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ ఇంకా వివాహం చేసుకోకుండా ఉండి ఉంటే ఇద్దరు కలిసి పోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు