Project K: ఆ సినిమాకు కాపీనా.?

ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సినిమా కల్కి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ఈ సినిమాను చేస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా అని తెలియడం కాకుండా ఈ సినిమా గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ లేదు.

ఈ సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఈ సినిమా ఫలానా సినిమాకు కాపీ అని కూడా కొన్ని వార్తలు వినిపించడం విశేషం. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఇది ఒక కొత్త ప్రపంచం అని ఇదివరకు మునుపెన్నడు చూడని విధంగా ఈ సినిమా ఉంటుందని, ఈ సినిమా కోసం ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వచ్చామంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.

ఏదేమైనా ఒక ఆలోచన చాలామందికి రావటం అనేది కామన్ పాయింట్. అయితే ఆ ఆలోచనను ఒకరు చెప్పే విధానం బట్టి సినిమా అవుట్ ఫుట్ బయటకు వస్తుంది. ఇద్దరు వేరువేరు దర్శకులు చదివిన ఒకే పుస్తకం ఇద్దరికీ వేర్వేరు ఆలోచనలను రేకెత్తిస్తుంది. అలానే వేరువేరు కథలను తయారు చేసుకోగలిగే ఆలోచనను ప్రేరేపిస్తుంది.

- Advertisement -

ఇకపోతే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి “డునే” అనే సినిమాకు కాపీ అని చిన్నగా వార్తలు వినిపిస్తున్నాయి. 2021 లో డునే అనే ఒక అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామా రిలీజ్ అయింది. కల్కి కూడా ఆ సినిమాను పోలి ఉంటుందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కూడా “డునే” అనే అదే పేరుతో ఉన్న ఒక నవల నుంచి ఆధారం చేసుకుని తీసిన సినిమా. అదే నవలను కూడా చదివి ఉండొచ్చు అనేది కొంతమందికి అనిపిస్తున్న అభిప్రాయం. ఏదేమైనా నవల నుంచి కూడా ఇంతకుముందు చెప్పినట్లు ఒక కొత్త ఆలోచన నాగ్ అశ్విన్ కి పుట్టి ఉండొచ్చు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు