Vishwaksen : “గామి” ట్రైలర్ ముహూర్తం ఫిక్స్.. ఆ ఫార్మాట్ లో ఫస్ట్ టైం!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో “గామి” ఒకటి. విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. విద్యాధర్ దర్శకత్వం లో కార్తీక్ శబరీష్ నిర్మించిన “గామి” చిత్రంలో చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించింది. రీసెంట్ గా గామి పాత్రల్ని చూపిస్తూ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో అఘోర శంకర్ గా విశ్వక్ సేన్ నటిస్తుండగా, ఒక మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ అఘోర ప్రయాణమే ఈ చిత్రమని సమాచారం. ఇక ఈ టీజర్ లోనే ఫిబ్రవరి 29న థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

అయితే తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ని గుర్తు చేస్తూ మేకర్స్ మరో అనౌన్స్ మెంట్ కూడా చేయడం జరిగింది. టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడానికి, మూవీ మేకర్స్ హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో PCX ఫార్మాట్ లో స్క్రీన్‌పై “గామి” థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 29 న సాయంత్రం 4 ట్రైలర్ ని గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ చేస్తున్నామని, అలాగే యూట్యూబ్ లో కూడా అదే టైం కి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఇక గామి దర్శకుడు విద్యాధర్‌ నాలుగేళ్ల పాటు గామి కోసం చాలా రీసెర్చ్‌ చేయగా, మూడేగేళ్లుగా చిత్రీకరణ జరిపామని మేకర్స్ డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఇక గామి సినిమాను శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారిక పెడద కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ట్రైలర్ తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో, సినిమా పై ఏ రేంజ్ లో క్రేజ్ పెంచుతుందో చూడాలి.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు