Gaami movie teaser talk : ఇంట్రెస్టింగ్ గా గామి క్యారెక్టర్స్.. అతని పాత్రపైనే అందరి చూపు!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌ లో “గామి” ఒకటి. లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీ అంటూ వచ్చి ఓ మోస్తరు హిట్ అందుకున్న విశ్వక్ ఈ ఇయర్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూసాడు. కానీ షూటింగ్ డిలే కారణంగా ఏప్రిల్ కి వాయిదా వేశారు. అయితే దాని కంటే ముందే విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా రిలీజ్ కి రెడీ అయింది. విద్యాధర్ దర్శకత్వం లో కార్తీక్ శబరీష్ నిర్మించిన “గామీ” అనే చిత్రంలో విశ్వక్ సేన్ నటించగా, చాందిని చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే భారీ అంచనాలు ఏర్పడగా లేటెస్ట్ గా గామి పాత్రల్ని చూపిస్తూ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇప్పటి వరకు ఒక మాస్ హీరో లాంటి రోల్స్ లోనే కనిపించిన విశ్వక్ సేన్ ఫస్ట్ టైం గామి మూవీలో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. టీజర్ ద్వారా అఘోర శంకర్ గా కనిపిస్తున్నాడని తెలియగా, ఒక మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ అఘోర ప్రయాణమే ఈ చిత్రమని సమాచారం.

“గామి” ప్రపంచంలోని పాత్రలను పరిచయం చేస్తున్నాము అంటూ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. అలాగే ఫిబ్రవరి 29న థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ రిలీజ్ చేశారు. దాంతో పాటు మార్చి 8న గామి మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. టీజర్ లో ‘ఇదే నీ సమస్యకు పరిష్కారం’ అంటూ విశ్వక్ సేన్ ప్రాబ్లమ్ కు నివారణ చెప్పే వాయిస్ ఓవర్ తో ఇంట్రెస్టింగ్ గా వీడియో ప్రారంభమైంది.

- Advertisement -

ఇక ఆ తర్వాత చిత్ర నటీనటుల్ని పరిచయం చేసారు. అభినయ, హీరోయిన్ చాందినీ చౌదరిని సహా సినిమాలో మిగతా పాత్రలను ఇంట్రడ్యూస్ చేసి చివరగా విశ్వక్ సేన్ ని అఘోర శంకర్ గా చూపించారు. ఇవన్నీ దాటుకుని నా వల్ల అవుతుందంటారా అని విశ్వక్ చెప్పిన డైలాగ్ ఆసక్తి పెంచుతోంది. ఇక టీజర్ ఎండింగ్ లో విశ్వక్, చాందిని హిమాలయ పర్వతాలను ట్రెక్కింగ్ చేస్తున్నట్లు చూపించి ఎండ్ చేసారు. ఇక దర్శకుడు విద్యాధర్‌ నాలుగేళ్ల పాటు గామి కోసం చాలా రీసెర్చ్‌ చేయగా, నాలుగేళ్లుగానూ చిత్రీకరణ జరుపుకున్న గామి సినిమాను శివరాత్రి కానుకగా మార్చి 8వ తేదీని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు