Vishwak Sen : బిగ్ బాస్ బ్యూటీకి ఫ్లాట్… స్టేజ్ పైనే మనలోని మాట చెప్పేసిన విశ్వక్

హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఆయన సినిమాలతో పాటు ఎప్పుడూ కాంట్రవర్సీలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఈ హీరో ఒక బ్యూటిఫుల్ యాంకర్ కు పడిపోయాడు. ఆ విషయాన్ని స్టేజ్ పై సదరు యాంకర్ ముందు స్వయంగా విశ్వక్ సేన్ బయట పెట్టడం విశేషం. ఇంతకీ ఆ యాంకర్ ఎవరు? విశ్వక్ సేన్ ఆమెపై చేసిన కామెంట్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

విశ్వక్ సేన్ అఘోరాగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గామి”. విద్యాధర దర్శకత్వం అందిస్తున్న “గామి” మూవీలో చాందిని చౌదరి హీరోయిన్ గా, అభినయ, హారిక తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉన్న “గామి”కి ఎట్టకేలకు “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” వాయిదా వల్ల మోక్షం దక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మార్చ్ 8న రిలీజ్ కాబోతున్న “గామి” మూవీ ప్రమోషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వక్ సేన్ పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్ కు బిగ్ బాస్ ఫేమ్ స్రవంతి చొక్కారపు యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ స్రవంతిపై పొగడ్తల వర్షం కురిపించారు. మైక్ అందుకున్న విశ్వక్ “ఈ మధ్య మీరు హీరోయిన్ల కంటే మంచి చీరలు కడుతున్నారు” అని కామెంట్ చేశాడు. విశ్వక్ పొగడ్తలకు మురిసిపోయిన స్రవంతి థాంక్స్ చెప్పింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో స్రవంతి కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ ఓటిటి వెర్షన్ తర్వాత ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. ఇక విశ్వక్ సేన్ విషయానికి వస్తే… మార్చ్ 8న నిజానికి ఆయన హీరోగా నటించిన మరో చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” రిలీజ్ కావాల్సి ఉంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడడం కారణంగా, “గామి” అదే డేట్ కు థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేశారు. చాలాకాలం నుంచి రిలీజ్ కు నోచుకోని ఈ మూవీ “గ్యాంగ్ ఆఫ్ గోదావరి” పోస్ట్ పోన్ కారణంగా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ మూవీతో పాటు విశ్వక్ సేన్ తన పదవ సినిమాను కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కొత్త రిలీజ్ డేట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు