HBD Trisha: త్రిష సినీ కెరియర్ సక్సెస్ వెనుక ఇంత కష్టం వుందా..?

HBD Trisha.. కోలీవుడ్ బ్యూటీ త్రిష అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా రెండు ఇండస్ట్రీలలో ఉండే స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ అదే స్టార్ హోదాతో కొనసాగడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.. నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా వివాహానికి దూరంగా ఉంటూ తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటూ అయస్కాంతం లా ఆకర్షిస్తోంది.. ఆరంభంలో కుర్ర హీరోలతోనే నటిస్తానని మడి కట్టుకున్న ఈమె ఆ తర్వాత అగ్ర కథానాయకులతో కూడా నటించింది. అలా టాలీవుడ్ టాప్ స్టార్స్ అయినా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ , మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ, గోపీచంద్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఇలా చాలామంది హీరోలతో నటించి మురిపించింది ఈ ముద్దుగుమ్మ

HBD Trisha: Trisha's film career success is so difficult..?
HBD Trisha: Trisha’s film career success is so difficult..?

ఐశ్వర్యారాయ్ అందంతో పోటీ..

ఇక తర్వాత కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరమైన త్రిష ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాలో నటించి రీఎంట్రీ తో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో తనకంటే 10 సంవత్సరాలు వయసులో పెద్దదైన ఐశ్వర్యారాయ్ బచ్చన్ అందం ముందు ఒక వెలుగు వెలిగింది.. రెండు భాగాల్లో కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో మెప్పించింది. 1983 మే 4న చెన్నైలో జన్మించింది ఈ ముద్దుగుమ్మ బీబీఏ పూర్తి చేసిన త్రిష 1999లో మిస్ సేలం అలాగే అదే ఏడాది మిస్ మద్రాసుగా కూడా ఎంపికయి.. 2001లో మిస్ ఇండియా పోటీలో బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

సిమ్రాన్ ఫ్రెండ్ గా కెరియర్ మొదలు..

ఇక 1999లో జోడి సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ గా తెరపై తొలిసారి కనిపించిన ఈమె నీ మనసు నాకు తెలుసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది..ఆ తర్వాత వర్షం సినిమాతో ప్రభాస్ జోడిగా నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా సమయంలోనే ప్రభాస్తో ప్రేమలో పడి కొద్దిరోజులు అతడితో ప్రేమాయణం కొనసాగించింది .. కానీ కొన్ని కారణాలవల్ల ఇద్దరూ విడిపోయారు ..ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా అంటూ మరోసారి కవ్వించింది.. చాలామంది ఆడియన్స్ సినిమా కథలను పట్టించుకోకుండా త్రిష అందులో ఉందంటే చాలు ఎలాగున్నా చూసేసి అందులోని ఆమె అందాల విందును కనులారా లాగించేసి మైమరిచి పోతారు. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ్ , మలయాళం సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా కొనసాగుతోంది త్రిష

- Advertisement -

ఆ కష్టాలే సక్సెస్ కు పునాది..

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది..ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న ఈమె వివాహ విషయంపై ప్రకటించి ఎప్పుడు ప్రేక్షకులను ఆనంద పరుస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు