Nabha Natesh : అక్కడ నభా కి గాయం ఇంకా తగ్గలేదా?

Nabha Natesh : టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ తెలుగులో మళ్లీ బిజీగా మారింది. వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టి సినిమాలు చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టీవ్ గా ఉంటూ జోరు చూపిస్తుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయిన నభా నటేష్ ఆ తర్వాత వరుసగా క్రేజీ సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న నభా ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతుంది. అయితే నాభ నటేష్ ఆఫర్లు రాక న్నీ రోజులు సినిమాలకు దూరంగా ఉందని అనుకున్నారు అందరూ.. కానీ అసలు విషయం వేరే ఉందని తర్వాత తెలిసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో నిఖిల్ స్వయంభు, అలాగే ప్రియదర్శితో డార్లింగ్ అంటూ పలు మూవీ ప్రాజెక్టులతో నభా నటేష్ బిజీగా మారిపోయింది. నిజానికి కరోనా కంటే ముందు నభా మంచి స్పీడు మీద ఉండేది. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ అంటూ ఇలా వరుస చిత్రాలతో సందడి చేసింది. అయితే ఇస్మార్ట్ శంకర్ తరువాత నభాకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ లాక్ డౌన్ తర్వాత సినిమాలకి కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చింది. తాజాగా దానికి కారణమేంటో తెలిసింది.

ఆ ప్రమాదం కారణంగా ఏడాది పాటు ఇంట్లోనే..

అయితే నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరుస ఛాన్సులు వచ్చినా రిజెక్ట్ చేయడానికి కారణం వేరే ఉంది. కరోనా టైంలో ఆమెకు ఓ ప్రమాదం జరగడం వల్ల, ఓ ఏడాది పాటు బెడ్డుకే పరిమితం అయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం మూలానే నభా నటేష్ సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక నభా నటేష్ భుజం, మోచేతికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆ గాయం యొక్క గుర్తులు ఇంకా అలానే ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ రీల్‌ని చూస్తేనే ఈ విషయం అర్థం అవుతోంది. నభాకి ఇంకా ఆ గాయం గుర్తులు తగ్గినట్టుగా కనిపించడం లేదు. నభా నటేష్ తాజాగా షేర్ చేసిన రీల్ వీడియోలో ఆమె భుజంపై ఉన్న గాయానికి సంబంధించిన గుర్తులు మాత్రం వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే ఆమె భుజానికి ఎంతటి గాయమైందో అర్థం అవుతోంది. అందుకే నభా ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మాత్రం నభా నటేష్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.

వరుస ప్రాజెక్టులతో బిజీ..

ఇక సినిమాలకు కొన్ని రోజులు దూరమైనా తన హాట్ ఫోటో షూట్లతో, రీల్స్ తో ఇన్ని రోజులు నెట్టింట్లో ఈ భామ(Nabha Natesh) సందడి చేసింది. అందుకే తక్కువ సినిమాలు చేసినా ఇంస్టాగ్రామ్ లో 5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో నన్ను దోచుకుందువటే అనే చిన్న సినిమాతో ఈ కన్నడ బ్యూటీ తెలుగు ప్రేక్షులకు పరిచయమైనా, అందరికి తెలిసేలా ఇస్మార్ట్ శంకర్ ఆమెకు మొదటి కమర్షియల్ హిట్ అన్న సంగతి తెలిసిందే. ఆ మూవీ తరువాత ఇస్మార్ట్ పోరిగా కుర్రాళ్లకు దగ్గరైంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ కూడా ఓ మోస్తరు సక్సెస్ ని అందించింది. ఇక ఇప్పుడు నటిస్తున్న స్వయంభు, డార్లింగ్ సినిమాలతో నభా రచ్చ చేయడానికి రెడీ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు