Nabha Natesh : డార్లింగ్ పై పిచ్చి ఒకే.. ప్రియదర్శిని బెదిరిస్తుందేంటి?

Nabha Natesh : టాలీవుడ్ లో ఇస్మార్ట్ శంకర్ తో ఫేమస్ అయిన భామ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ సినిమాలో రామ్ తో పోటీ పడి స్టెప్పులేసి తెగ వైరల్ అయింది. ఆ తర్వాత డిస్కో రాజా, మాస్ట్రో వంటి చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు గత న‌భా కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంది. అయితే చాలా రోజులకు నిఖిల్ హీరోగా నటిస్తున్న చారిత్రక నేపథ్యం తో తెరకెక్కుతున్న ‘స్వ‌యంభు’ అనే భారీ చిత్రంలో న‌భా నటేష్ నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఆ సినిమాలో ఓ రాజ కుమారి గా నభా నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నభా సినిమాలకి కొంత గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా భారీ క్రేజ్ ఉన్న చిత్రంతో నటిస్తుంది. ఇదిలా ఉండ‌గా న‌భా సినిమాలకి గ్యాప్ ఇచ్చినా ఎప్పటికప్పుడు సోష‌ల్ మీడియాల్లో అభిమానుల తో టచ్ లోనే ఉంటుంది. అప్పుడప్పుడూ స్పెష‌ల్ వీడియోలు, ఫోటోషూట్ల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. తాజాగా న‌భా షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ వీడియో తెగ వైరల్ అవుతుంది.

డార్లింగ్ మాషప్ తో ఇంప్రెస్ చేసిన నభా..

అయితే నభా తాజాగా పోస్ట్ చేసిన ఆ వీడియో లో న‌భా డార్లింగ్.. డార్లింగ్ అంటూ తన క్యూట్ ఎక్స్ప్రెషెన్స్ తో డార్లింగ్ ప్రభాస్ ని ఇమిటేట్ చేస్తూ వీడియో చేసింది. ఈ వీడియో ప్ర‌భాస్ ఫ్యాన్స్ అయితే తెగ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో లో ప్ర‌భాస్ డార్లింగ్ అంటూ చెబుతున్న‌ పాపుల‌ర్ డైలాగుల‌న్నిటినీ ఓ చోట మాష‌ప్ లా వాడింది. దీనికి న‌భా ఎక్స్ ప్రెష‌న్స్ ఇచ్చింది. ఈ వీడియో చూశాక ప్ర‌భాస్ ని అనుక‌రించిన న‌భాను తెగ పొగిడేస్తున్నారు ప్ర‌భాస్ ఫ్యాన్స్. త‌మ ఫేవ‌రెట్ డార్లింగ్ డైలాగ్స్ ని గుర్తు చేసినందుకు అభినందిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ అంటే నభా కి ఇంత పిచ్చా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నభా నిన్న షేర్ చేసిన ఈ వీడియో కి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, హీరో ప్రియదర్శి పులికొండ త్వేర్ వేసాడు. ఆ ట్వీట్ నుండి నభా ప్రియదర్శికి ఏకంగా బి కేర్ ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చేసింది.

ప్రియదర్శికి వార్నింగ్ ఇచ్చిన నభా?

అయితే నభా పోస్ట్ చేసిన ప్రభాస్ డార్లింగ్ మాషప్ వీడియో కి ప్రియదర్శి పులికొండ ట్విట్టర్ లో నభా ని పొగుడుతూ ట్వీట్ వేసాడు. నభా వీడియో కి ‘వావ్ సూపర్ డార్లింగ్’.. కిరాక్ ఉన్నావ్ డార్లింగ్ అంటూ సరదాగా ట్వీట్ వేసాడు. దానికి నభా కౌంటర్ వేస్తూ, ‘మిస్టర్ మాటలు అనే ముందు ఒకసారి ఆలోచించండి’ అంటూ, ఓ హరాస్మెంట్ పోస్ట్ ని పెట్టింది. ఆ పోస్ట్ లో సెక్సువల్ హరాస్మెంట్ 354A IPC సెక్షన్ కింద జైల్లో వేస్తారని ఉంది. దానికి ప్రియదర్శి మళ్ళీ రిప్లై ఇస్తూ మీరు డార్లింగ్ అనొచ్చు, మేమంటే జైలుకా! లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై ఇచ్చాడు. దానికి నభా మళ్ళీ డు నాట్ క్రాస్ ది లైన్.. చూసుకుందాం అని అంది.

- Advertisement -

దీనిపై నెటిజన్లు రాకరకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళు సరదాగా కావాలనే వార్నింగ్ ఇచ్చుకున్నారని కొందరు అంటుంటే, ఈ రోజుల్లో మూవీ ప్రమోషన్స్ కోసం ఇలా కూడా చేస్తున్నారని, బహుశా కొత్త మూవీ అనౌన్స్ మెంట్ ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారేమోనని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఈ రచ్చ మాత్రం నిన్న ట్విట్టర్ లో బాగానే వైరల్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు