Maname : కల్కి తప్పుకున్న డేట్ కి శర్వా? రిస్కే?

Maname : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రెండేళ్ల కింద చివరిగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ అందుకున్న శర్వా పెళ్లి చేసుకుని గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న ‘మనమే’ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతున్నాడు. కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కి జోడీగా నటిస్తుంది. తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఇక రెండేళ్లు సినిమాలకి గ్యాప్ ఇచ్చిన శర్వా ఇతర ప్రాజెక్టులు కూడా ఒకే చేసి ఒకే సారి మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక ఇప్పటి వరకు వచ్చిన మూవీ టైటిల్ టీజర్, ఫస్ట్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక క్లాస్ సినిమాతో శర్వానంద్ వస్తుండడం వల్ల మనమే సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే మనమే సినిమా రిలీజ్ డేట్ విషయం లో మాత్రం మేకర్స్ ఇంకా సందిగ్ధత లో ఉన్నారని తెలుస్తుంది. ఆ మధ్య ఎప్రిల్ 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మేకర్స్ మరో రిలీజ్ డేట్ ని ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది.

కల్కి డేట్ కి శర్వా?

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం శర్వానంద్ మనమే (Maname) మూవీ ని నిర్మాతలు ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్ పై ఫోకస్ చేసారని తెలుస్తుంది. అంటే కల్కి కి పోటీగా కాదు. గతంలో కల్కి 2898AD మూవీ మే 9న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. అయితే ఎలక్షన్ల కారణంగా మూవీ ఓపెనింగ్స్ పై ప్రభావం ఉంటుందని చిత్ర యూనిట్ భావించింది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ మూవీని వాయిదా వేశారు. ఎందుకంటే కల్కి పాన్ ఇండియా మూవీ కాబట్టి ఎక్కడ ఓపెనింగ్స్ తక్కువొచ్చినా భారీ బడ్జెట్ సినిమా తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆల్రెడీ వాయిదా పడ్డ కల్కి కొత్త రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 18న అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే కల్కి సమ్మర్ రిలీజ్ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు శర్వానంద్ మనమే చిత్రాన్నీ మేకర్స్ ఆ డేట్ కి, అంటే మే 9 కి తీసుకువద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తారు. పైగా మీడియం రేంజ్ హీరో సినిమా కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారని తెలుస్తుంది.

శర్వా సినిమా అయినా ఇక్కడ రిస్కే?

అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మనమే సినిమాకు కూడా చాలా ఇబ్బందే అని తెలుస్తుంది. ఎందుకంటే దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎలెక్షన్లు ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎలెక్షన్లు కూడా ఉన్నాయి. దీనివల్ల రాజకీయ హడావిడి లో ప్రజలు ఈ సినిమాని పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ ఇంపాక్ట్ శర్వానంద్ సినిమాపై ఖచ్చితంగా పడే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. దీనికి తోడు ఆ తరువాత వారమే విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా రిలీజ్ కానుంది. కాబట్టి శర్వా సినిమా అదే డేట్ కు వస్తే కాస్త రిస్క్ అంటే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి మనమే కల్కి డేట్ కే వస్తుందా? లేదా మరొక డేట్ ను ఫిక్స్ చేసుకుంటుందా అనేది చూడాలి. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మనమే మూవీ రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో మనమే వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. మరి చిత్ర యూనిట్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటిస్తే కానీ ఈ వార్తలపై ఫుల్ స్టాప్ పడదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు