20Years For Pedababu : రెండు దశాబ్దాల పెదబాబు.. ఆరోజుల్లో జగపతిబాబు కి హ్యాట్రిక్ కంబ్యాక్..!

20Years For Pedababu : టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు సినిమాల శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శోభన్ బాబు తర్వాత ఆ స్థాయిలో మహిళా ప్రేక్షకాదరణ పొందిన ఈ హీరో 90స్ లో 20స్ లో ఫ్యామిలీ స్టార్ గా, మ్యాన్లీ హీరోగా ఓ వెలుగు వెలిగారు. అప్పటి స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తర్వాత మిడ్ రేంజ్ స్టార్స్ గా శ్రీకాంత్, జగపతి బాబు వంటి స్టార్ హీరోలు నిలిచారు. ఇక జగపతిబాబు కి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక జగపతి బాబు కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాల్లో పెదబాబు చిత్రం కూడా ఒకటి. 2004 ఏప్రిల్ 30న రిలీజ్ అయిన ఈ చిత్రం నేటికీ 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక వరుస ప్లాపులు అందుకున్న జగపతి బాబు ఆ ఏడాది పెదబాబు చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు.

పెదబాబు కథ విషయానికి వస్తే..

ఊరి పెద్ద అయిన ‘పెదబాబు’ అదే ఊళ్ళో ఉంటున్న తన తల్లి సహా కుటుంబానికి దూరంగా ఉంటాడు. పెదబాబును గ్రామపెద్దగా ఊరంతా గౌరవించే పెదబాబు, ఎందుకు తల్లికి దూరంగా ఉంటున్నాడు. గత పాతికేళ్లుగా ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడడు, కారణం ఏంటనే? ఫ్లాష్‌బ్యాక్ కథతో చిత్రం సాగుతుంది. ఈ చిత్రం మెయిన్ కథ మొత్తం తల్లి కొడుకుల బంధం చుట్టే తిరుగుతుంది. ఇందులో జగపతి బాబు, అలాగే తల్లిగా సుహాసిని వారి పాత్రలకు ప్రాణం పెట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా సుహాసిని కళ్లలో తన కొడుకు ప్రేమ కోసం ఆరాటాన్ని చూస్తుంటే ప్రేక్షకుల కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇక మిగతా పాత్రలు కూడా పర్లేదనిపిస్తాయి. అయితే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి వినోదం పరంగా సునీల్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎంటర్టైన్మెంట్ విషయంలో సునీల్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు.

తల్లి కొడుకుల అనుబంధంగా క్లాసిక్..

అయితే ఈ సినిమాలో ఎమోషనల్ పాళ్ళు ఎక్కువ ఉండే సరికి మరీ క్లాస్ ఆడియన్స్ కి అంతగా మెప్పించలేదు. ఇక సినిమాలో ‘పెదబాబు’కి సెంటిమెంట్‌ ఎక్కువ. కథ పరంగా మహిళలు మరియు ఫ్యామిలీ ప్రేక్షకులనే లక్ష్యంగా చేసుకుంది. ఇక ఆరోజుల్లో లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం డీసెంట్ హిట్ గా నిలిచింది. అప్పట్లో వరుస ప్లాపుల్లో ఉన్న జగపతి బాబు 2004 లో అతడే ఒక సైన్యం, ఖుషి ఖుషీగా తో పాటు, పెదబాబు (20Years For Pedababu) సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాడు. ఇక 20స్ ఆరంభంలో ఒక ఊపు ఊపిన జగపతిబాబు ఆ తర్వాత వరుస ప్లాపులతో చల్లబడ్డారు. ఇక పదేళ్ల కింద అంటే 2014 లో వచ్చిన లెజెండ్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సూపర్ సక్సెస్ అయిన జగ్గూభాయ్ ఇప్పుడు వరుస సినిమాలలో ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు