Most watched Telugu Web Series on Zee 5 : జీ5లో ఎక్కువ మంది మెచ్చిన తెలుగు క్రైమ్ వెబ్ సిరీస్ ల లిస్ట్

Most watched Telugu Web Series on Zee 5 : ఓటిటికి పాపులారిటీ పెరిగిన తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పలు వెబ్ సిరీస్ లను జనాలు ఎగబడి మరీ వీక్షించి టాప్ ప్లేస్ ను కట్టబెట్టారు. ముఖ్యంగా కొన్ని క్రైమ్ వెబ్ సిరీస్ లకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. అలా క్రైమ్ థ్రిల్లర్ జానర్ వెబ్ సిరీస్ లను ఇష్టపడే వారికోసం జీ5 ఓటిటిలో టాప్ 5లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లపై ఓ లుక్కేద్దాం.

1. షూటవుట్ ఎట్ ఆలేరు

శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రను పోషించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ షూటవుట్ ఎట్ ఆలేరు. హైదరాబాద్ లోని పాత బస్తీ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ కు డైరెక్టర్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. ఆలేరులో షూటవుట్ జరగగా, పోలీసులు ఎలా ఛేజ్ చేశారు అనే ఇంట్రెస్టింగ్ స్టోరీతో సాగే ఈ వెబ్ సిరీస్ కు చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించారు.

2. పులి మేక

హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ జంటగా నటించిన క్రైమ్ డ్రామా పులి మేక. ఊహించని ట్విస్ట్ లతో సాగే ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చక్రవర్తి రెడ్డి దర్శకత్వంలో పులి మేక రూపొందగా, కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సిరీస్ 8 ఎపిసోడ్లతో ఆసక్తికరంగా నడుస్తుంది.

- Advertisement -

3. గాలి వాన

రాధిక శరత్ కుమార్, చాందిని చౌదరి, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ గాలి వాన. వన్ ఆఫ్ అనే బ్రిటిష్ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ఈ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఆసక్తికరమైన ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్ లు ఉండగా, ఓ ఊర్లో ఫ్యామిలీ, దారుణమైన హత్య చుట్టూ తిరుగుతుంది స్టోరీ మొత్తం.

4. రెక్కీ

శివ బాలాజీ, శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైం డ్రామా రెక్కీ వెబ్ సిరీస్. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ జీ5 లో టాప్ ఫైవ్ లో స్థానం దక్కించుకుంది. తండ్రిని చంపాలనుకునే ఓ కొడుకు కథే రెక్కీ స్టోరీ.

5. ఏటీఎం

బిగ్ బాస్ విన్నర్ సన్నీ హీరోగా నటించిన క్రైమ్ వెబ్ సిరీస్ ఏటిఎం. హరీష్ శంకర్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు చంద్ర మోహన్ దర్శకత్వం వహించాడు. ఓ నేరంలో చిక్కుకున్న ఫ్రెండ్స్ టీం దాని నుంచి ఎలా బయట పడింది అనే అంశాన్ని ఎనిమిది ఎపిసోడ్లలో చూపించారు. దీనితో పాటే జీ5లో చదరంగం, లూజర్ వంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ ఈ టాప్ 5 వెబ్ సిరీస్ లను చూసి ఎంజాయ్ చేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు