Salman Khan: సల్మాన్ ఖాన్ ఎఫైర్ జాబితాలో ఇంతమందా..?

 Salman Khan: బాలీవుడ్ లో కండల వీరుడు గా పేరుపొందిన సల్మాన్ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కూడా పేరు పొందారు. ఇప్పటికి తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ పలు రకాల రికార్డులను సైతం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు సల్మాన్ ఖాన్.. సినిమాల పరంగా సక్సెస్ అయ్యారు కానీ వ్యక్తిగతంగా ఆయన వయసు 50 సంవత్సరాలు దాటినా ఇంకా ఒంటరిగానే ఉన్నారు.. కానీ ఈయన ఎఫైర్ లిస్ట్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే. ఎంతోమంది హీరోయిన్స్ తో లవ్ ట్రాక్ నడిపిన సల్మాన్ ఖాన్.. పెళ్లి వరకు ఆ బంధాలను తీసుకురాలేకపోయారు.

Salman Khan: do you know Salman Khan effair list..
Salman Khan: do you know Salman Khan effair list..

సల్మాన్ ఖాన్ ఎఫైర్ లిస్ట్..

సల్మాన్ ఖాన్ కెరియర్ లో మొదట షాహిన్ జఫ్రి తో ప్రేమాయణం నడిపారు.. ఆ తర్వాత విడిపోయిన సల్మాన్ ఖాన్ మళ్లీ సోమీ అలీతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి. త్వరలోనే వీరు వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించే తరుణంలో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ తో ప్రేమలో పడినట్టుగా వార్తలు వినిపించాయి . దీంతో ఒక్కసారిగా సోమీ అలీ మనసు ముక్కలైంది.. దీంతో ఇది కూడా బ్రేకప్ కు కారణం అయ్యింది. ఆ తరువాత సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ ఇద్దరూ కూడా ఘాటు ప్రేమలో మునిగితేలారు. అయితే ఆ ప్రేమని మాత్రం పెళ్లి వరకు తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ ని బెదిరించడంతో విడిపోయినట్టు సమాచారం.

స్నేహ ఉల్లాల్ తో కూడా ప్రేమాయణం..

అచ్చం ఐశ్వర్యరాయ్ లాగా ఉండేటువంటి హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ను కూడా సల్మాన్ ఖాన్ వదిలిపెట్టలేదట.. వీరిద్దరూ చాలాకాలం వరకు ప్రేమలో మునిగి తేలారని సమాచారం.. అంతేకాదు వీరిద్దరూ కలిసి లక్కీ అనే సినిమాలో కూడా నటించారు. ఆ తర్వాత విడిపోవడంతో స్నేహ ఉల్లాల్ తెలుగుతోపాటు పలు సినిమాలలో ఇతర భాషలలో కూడా నటించింది.

- Advertisement -

కత్రినా కైఫ్ తో ఎఫైర్..

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా సల్మాన్ ఖాన్ తో పీకల్లోతులో ప్రేమలో ఉండేదట. వీరిద్దరూ చాలా సంవత్సరాలు డేటింగ్ చేశారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. దీంతో చివరికి వీరిద్దరూ వివాహం చేసుకుంటారని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బ్రేకప్ అయ్యారని వార్తలు వినిపించాయి.

జాక్వెలిన్ ను కూడా వదలని సల్మాన్..

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సల్మాన్ ఖాన్ కంటే చాలా చిన్న వయసు ఉన్న అమ్మాయి..ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడిందట. వీరిద్దరూ కలిసి ముంబైలో చాలా హోటల్స్ లో కూడా కనిపించడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఈమెతో కూడా ఎక్కువ కాలం ప్రేమలో ఉండలేకపోయారు.

పూజా హెగ్డే కూడా..

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ లవ్ లో ఉన్నారని వార్తలు తెగ హల్చల్ చేశాయి. వీరిద్దరూ కలిసి కిసీకా బాయ్ కీసీకా జాన్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇందులో నిజం లేకపోయింది..

వీరే కాకుండా..

వీరే కాకుండా ఇలియా వంతూర్.. బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్.. మరొక బాలీవుడ్ బ్యూటీ క్లాడియా సిసేలా.. 1980లో మిస్ ఇండియాగా నిలిచిన సంగీత బిజ్లానీ వంటి వారితో సల్మాన్ ఖాన్ పీకల్లోతులో ప్రేమలో మునిగినప్పటికీ కూడా వీరితో ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు