HBD Jagapathibabu: పడిలేచిన కెరటం.. ఆయనకే సాధ్యం..!

HBD Jagapathibabu

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు అంటే ఎనలేని గౌరవం.. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేసి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు అంటే ఎనలేని ఇష్టం.. ఒకప్పుడు నటుడుగానే పనికిరాడిన్న కామెంట్స్ ను దాటి బెస్ట్ యాక్టర్ గా ఏకంగా ఏడు నంది అవార్డులను అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.. శోభన్ బాబు తర్వాత మహిళా అభిమానులను ఆ స్థాయిలో సంపాదించుకున్న హీరోగా జగపతిబాబు రికార్డు సృష్టించారు. రియల్ లైఫ్ లో కూడా మ్యాన్లీ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన.. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మరింత బిజీగా మారిపోయారు.

ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన సినీ జీవితం ఎలా సాగింది అన్న విషయం ఒకసారి చూసి తెలుసుకుందాం.. జగపతిబాబు సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీ లోకి వచ్చారు.. జగన్నాటకం, పెద్దరికం వంటి సినిమాలతో బ్రేక్ తెచ్చుకున్న ఈయన పెద్దరికం సినిమాతో యువతలో ముఖ్యంగా అమ్మాయిలలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన వెను తిరిగి చూసుకోలేదు. ఇక అల్లరి ప్రేమికుడు సినిమాలో ప్లే బాయ్ గా కనిపించారు. ఇక 1994లో చాలా ఏళ్ల తర్వాత సక్సెస్ కి పుల్ స్టాప్ పడిందని చెప్పాలి. అప్పటివరకు క్లాస్, మాస్ డైరెక్టర్స్ చేతిలో పడ్డా .. రాని ఇమేజ్ ఎస్.వీ.కృష్ణారెడ్డి ఇచ్చారు..

శుభలగ్నంలో భార్య పెట్టే ఇబ్బందులను తట్టుకొని చివరికి డబ్బు కోసం తనను అమ్మినా.. ఆమెపై ఉండే ప్రేమతో నిశ్శబ్దంగా ఉండే సగటు మనిషిగా జగపతిబాబు నటనకు లేడీ అభిమానులంతా ఫిదా అయిపోయారు. శోభన్ బాబు తర్వాత అలాంటి హీరో మళ్ళీ దొరికాడని మొత్తం ఇండస్ట్రీ తో పాటు ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇకపోతే మంచి కథ పడితే ఆ కథలో తనను తాను నిరూపించుకునేందుకు ఎప్పుడు జగపతిబాబు వెనుకాడలేదు.. హీరోగా ఒకానొక సమయంలో సక్సెస్ అందుకున్నారు.. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన తీసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి.. దీంతో తిరిగి లెజెండ్ సినిమాతో విలన్ గా అవతరించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు..

- Advertisement -

జగపతిబాబు విలనిజం చూసి మొత్తం సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.. ఏ పాత్రైనా చేయగల కెపాసిటీ ఉన్న సిసలైన నటుడు అని నిరూపించుకున్నారు జగపతిబాబు.. అందుకే సినిమాలలో హీరోగా చేసినప్పుడు ఎన్నో ఆర్థిక నష్టాలను ఎదుర్కొని చివరికి ఆస్తులు కూడా అమ్ముకున్న ఈయన ఆ తర్వాత విలన్ గా అవతరించి తన సత్తా చాటి నిరూపించారు.. ప్రస్తుతం విలన్ గా కొనసాగుతూ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నారు జగపతిబాబు.. అంతేకాదు అంతకుమించి రెమ్యునరేషన్ కూడా తీసుకుంటూ ఉండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే హీరోగా కిందపడి విలన్ గా పైకి లేచిన ఈయన సినీ జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం అని చెప్పవచ్చు. మొత్తానికైతే జగపతిబాబు సినీ జీవితం ఒక పడి లేచిన కెరటం అని చెప్పడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు