Ooru Peru Bhairavakona: లక్-స్ట్రాటజీ-సెంటిమెంట్… అన్నీ వర్క్ అవుట్ అవుతున్నాయి

Ooru Peru Bhairavakona

ఊరు పేరు భైరవకోన… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమా. సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వలేదు. చాలా అంచనాలు ఉన్న ఈగల్ మూవీకి మిక్సిడ్ టాక్ వచ్చింది. కొంత మంది అయితే ఈగల్ ను డిజాస్టర్ అని చెప్పేస్తున్నారు. దీంతో ఆడియన్స్ ఓ పర్ఫెక్ట్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అది ఈ ఊరు పేరు భైరవకోన అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

దీనికి కారణం… ఒకటి సాంగ్స్. చాలా రోజుల క్రితమే ఈ సినిమాలోని “నిజమేనే చెబుతున్నా…” అంటూ వచ్చిన సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటికే 71 మిలియన్స్ వ్యూస్ తెచ్చుకున్న ఈ సాంగ్, ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. అలాగే మరొకటి… ట్రైలర్. ఈ మధ్య కాలంలోనే సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది. అందులో సినిమా ఒక ఇంట్రెస్టింగ్ లైన్‌తో రాబోతుందనే క్లారిటి ఆడియన్స్‌కు వచ్చింది. గరుడ పురాణం, ఖర్మ సిద్ధాంతం, చేతబడి లాంటి అంశాలు ట్రైలర్‌లో కనిపించడంతో సినిమాపై ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. దీంతో పాటు ఒక మూడు అంశాలు సినిమాకు ప్లస్ అవుతున్నాయి.

లక్…
సంక్రాంతి తర్వాత వచ్చిన ఒక్క సినిమా కూడా ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వలేదు. ఈగల్ వైపు ఓ వర్గం ఆడియన్స్ కన్నెత్తి కూడా చూడటం లేదు. యాత్ర2 గురించి అందరికీ తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ చేసిన లాల్ సలాం మూవీ కనీసం తమిళంలో కూడా వర్క్ అవుట్ అవ్వడం లేదు. ఈ టైం ఊరు పేరు భైరవకోన సరైనది అని చెప్పొచ్చు. అంటే… సందీప్ కిషన్ కు ఇది ఓ రకంగా లక్ కలిసొచ్చింది అని చెప్పొచ్చు.

- Advertisement -

స్ట్రాటజీ…
ఒక సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం అంటేనే చాలా ఆలోచిస్తారు. ఏ మాత్రం తేడా కొట్టినా, సినిమా టాక్ మొత్తం మారిపోతుంది. అలాంటి పరిస్థితి ఇటీవల గుంటూరు కారం సినిమాకు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఊరు పేరు భైరవకోన టీం మాత్రం పెయిడ్ ప్రీమియర్స్ వేయడమే కాదు… ఏకంగా రెండు రోజుల ముందు ప్రీమియర్స్ పేరుతో థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. గతంలో సామజవరగమన సినిమా టైంలో నిర్మాత రాజేశ్ దండా ఇదే ఫాలో అయ్యాడు. అప్పుడు ఈ స్ట్రాటజీ సక్సెస్ అవ్వడంతో… ఇప్పుడు ఊరు పేరు భైరవకోన విషయంలో కూడా దాన్నే ఫాలో అవుతున్నాడు. ఇది సక్సెస్ అయితే సినిమా లాంగ్ రన్ కు చాలా ప్లస్ అవుతుంది.

సెంటిమెంట్…
ఇక సినిమాకు సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే… సంక్రాంతి వార్ వల్ల ఈగల్ మూవీ సోలో రిలీజ్ మాటతో ఫిబ్రవరి 09న రిలీజ్ అయింది. అదే రోజు రిలీజ్ కావాల్సిన ఊరు పేరు భైరవకోన మూవీ ముందుగా వాయిదా వేయడానికి వీలు లేదని చెప్పారు. తమకు వాయిదా వేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్ లేదని అంటూ చెప్పారు. కానీ, ఫిల్మ్ ఛాంబర్… బలవంతగా వాయిదా వేయించేలా చేశారని ఆడియన్స్ కు అర్థమైంది. ఇది సినిమాపై పాజిటివిటీని తీసుకువచ్చింది.

ఇవే కాదు… ఊరు పేరు భైరవకోన వైపు ఆడియన్స్ తిరిగి చూసేలా… చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. వీటి అన్నింటితో సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు