Vijayashanthi: చిరంజీవితో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి..!

Vijayashanthi

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి.. ఆమె నటనతో డైలాగులతో ఎంతోమంది ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలలో నటించింది. టాలీవుడ్ లోనే మొట్టమొదటి రూ.1కోటి అందుకున్న నటిగా కూడా విజయశాంతి పేరు సంపాదించింది.. సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చింది. అయితే మళ్లీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఈ చిత్రంలో విజయశాంతి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ సినిమాలలో నటిస్తుంది అనుకుంటే ఎక్కడ ఆమె జాడ మాత్రం కనిపించడం లేదు.

ప్రస్తుతం రాజకీయాల పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన విజయశాంతి.. అప్పుడప్పుడు పలు యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉంటుంది..
ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయశాంతి తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను రాజకీయ జీవితం గురించి.. తనతో నటించిన హీరోల గురించి మాట్లాడడం జరిగింది.. సినీ ఇండస్ట్రీలో తనకు చాలామంది ఎక్కువగా మర్యాద ఇచ్చే వారని.. ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా సరే మహిళలను గౌరవించడం అనేది చాలా మంచిదంటూ తెలిపింది.

ఇప్పటికీ మీరు నటించిన హీరోలతో టచ్ లో ఉన్నారా అని యాంకర్ అడగగా.. అందుకు విజయశాంతి మాట్లాడుతూ.. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా బిజీగా మారిపోయాను.. ఈ క్రమంలోనే ఎవరిని కలిసేందుకు సమయమే సరిపోవడం లేదంటూ తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఎక్కువ సినిమాలు చేసిన హీరోలలో బాలయ్య , చిరంజీవి అని చెప్పవచ్చు. అయితే బాలకృష్ణ , చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉండడం వల్ల కొన్ని విభేదాల వల్ల వారితో కూడా సరిగ్గా కలవలేకపోయాను అంటూ తెలియజేసింది.

- Advertisement -

రాజకీయాలలోకి రావడం వల్ల చిరంజీవి , బాలయ్య వంటి హీరోలతో కూడా ఆమెకు విభేదాలు వచ్చాయని చెప్పకనే చెప్పేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఈతరం స్టార్ హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. విజయశాంతి కెరియర్ లో ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించింది. విజయశాంతి కెరియర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒసేయ్ రాములమ్మ, కర్తవ్యం సినిమాలు ఈమె కెరియర్ లోనే మరుపురాని చిత్రాలుగా నిలిచిపోయాయి.. ఇకపోతే రాజకీయ కారణాలవల్లే అటు చిరంజీవితో ఇటు బాలయ్యతో విభేదాలు వచ్చాయని.. అంతకుమించి తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికైతే విభేదాలపై క్లారిటీ ఇచ్చి మళ్లీ వార్తల్లో నిలిచింది విజయశాంతి. .

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు