Tamannah: పెళ్ళికి ముందే తమన్నా ప్రెగ్నెంట్ ?

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. వేళ్ళతో లెక్కపెట్టలేనంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. వారికే దర్శక నిర్మాతలు చాన్సులు ఇస్తూ ఉంటారు. ఆ విధంగానే ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు బంపర్ హిట్లు అందుకుంటూ ఉంటారు. అయితే ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

అలాంటి హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. మహారాష్ట్రలోని ముంబైలో పుట్టి పెరిగిన హీరోయిన్ తమన్నా భాటియా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో పాతుకుపోయారు. వాస్తవానికి 2005 సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేసిన తర్వాత మన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. అదే సంవత్సరం శ్రీ అనే సినిమాలో సంధ్య పాత్ర చేసి అందరిని మెప్పించింది. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈ బ్యూటీకి ఛాన్సులు రాలేదు.

ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో కేడి సినిమా చేసి మెప్పించే ప్రయత్నం చేసింది. తిరిగి 2007 సంవత్సరంలో మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హ్యాపీడేస్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది హీరోయిన్ తమన్నా భాటియా. హ్యాపీ డేస్ సినిమా బంపర్ హిట్ కావడంతో వరుసగా ఈ బ్యూటీ కి ఛాన్సులు వచ్చాయి. రెడీ… కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ లాంటి వరుస హిట్లతో దూసుకు వెళ్లింది హీరోయిన్ తమన్నా భాటియా.

- Advertisement -

అంతేకాకుండా ఊసరవెల్లి, బద్రీనాథ్, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, రెబల్, కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి బడా హీరోల సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించింది. ఇక రాజమౌళి చేసిన బాహుబలి సినిమాలో కూడా ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ తమన్నా గురించి ఓ పర్సనల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో హీరోయిన్ తమన్నా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారికంగా వీరిద్దరూ ప్రకటించకపోయినా… నడిచే తతంగం మొత్తం బహిరంగంగానే చేస్తున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందట. ఎండాకాలం అయిపోయిన తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. అయితే తాజాగా తమన్నా భాటియా మరియు విజయవర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట.

పెళ్లి కాకముందే ఒకరిని కణాలని అనుకుంటున్నారట. ఒకరిని కన్న తర్వాత… పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని ఈ ఇద్దరి మధ్య ఒక చర్చ వచ్చిందట. ఇప్పుడు ఇదే విషయం బాలీవుడ్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. అంటే పెళ్లి కాకముందే తల్లి కావాలని తమన్నా మరియు విజయ్ వర్మ అనుకుంటున్నారని అందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… ఈ విషయాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు నెటిజెన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు