Sathyadev : అంబటి రాయుడు బయోపిక్ లో టాలీవుడ్ హీరో ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తే… మరికొంతమంది తమ టాలెంటును ఉపయోగించి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇంకా కొంతమంది యంగ్ హీరోలు చిన్న చిన్న సినిమాలు చేసి బాగానే సంపాదిస్తున్నారు. అలాంటి హీరోలలో సత్యదేవ్ ఒకరు.

టాలీవుడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సత్యదేవ్ చేసిన ప్రతి సినిమా బంపర్ హిట్ అవుతుంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రతి సినిమా ప్రాణం పెట్టి చేస్తాడు సత్యదేవ్. అందుకే ఇప్పటివరకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరోలలో టాప్ మోస్ట్ గా ఉన్నాడు. అయితే అలాంటి హీరో సత్యదేవ్ సంచలన ప్రకటన చేశాడు. అంబటి రాయుడు బయోపిక్ లో తాను నటిస్తానని వెల్లడించారు.

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బయోపిక్ లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు వివరించారు యంగ్ హీరో సత్యదేవ్. కృష్ణమ్మ సినిమా మేకర్స్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో సత్యదేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ అంటూ ఉంటారు… కానీ నాకు అంబటి రాయుడు అంటే చాలా ఇష్టమని తెలిపారు సత్యదేవ్. ఆయన కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ అన్నారు. అలాంటి పాత్ర చేస్తే మజా వస్తుందని సత్యదేవ్ వెల్లడించారు. అలాంటి అంబటి రాయుడు జీవితం పై సినిమా తీస్తే… బాగుంటుందని తెలిపాడు సత్యదేవ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు