Cannes 2024 : ఫస్ట్ టైం కేన్స్ లో అడుగు పెట్టనున్న శోభిత… ఈ లిస్ట్ లో చేరే హీరోయిన్లు ఎవరంటే?

Cannes 2024 : స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ మొట్ట మొదటిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరవబోతోంది. ఫ్రెంచ్ రివేరాలో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియం ఐస్‌క్రీమ్ బ్రాండ్ మాగ్నమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న నటి శోభితా ధూళిపాళ కేన్స్ లో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ కనిపించనుంది.

ఈ విషయం గురించి శోభిత మాట్లాడుతూ “కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో మాగ్నమ్‌తో నా ప్రయాణాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్లడం ఉత్సాహంగా ఉంది. ఈ బ్రాండ్‌తో నా సంబంధానికి ప్రతీక, రంగురంగుల జ్ఞాపకాలను సృష్టించడంతో పాటు మేము అభివృద్ధి చెందుతాము. ఈ అనుభవం నాకు మారిచిపోలేని ఆనంద క్షణాలను సృష్టిస్తుంది. ఎందుకంటే ఈ అసోసియేషన్ ఫ్యాషన్, ఫిల్మ్, ఫ్లేవర్‌ల సంపూర్ణ సమ్మేళనం” అంటూ ఎగ్జయిట్మెంట్ ను వ్యక్తం చేసింది.

HUL – ఫుడ్స్ అండ్ రిఫ్రెష్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ కృష్ణమూర్తి మాట్లాడుతూ “ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శోభితతో భాగస్వామ్యం కావడం వల్ల మాగ్నమ్ ఐస్ క్రీం అధునాతనత, ధైర్యం, ఆనందాన్ని సూచిస్తుంది” అని అన్నారు.

- Advertisement -

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొననున్న హీరోయిన్లు…

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 77వ ఎడిషన్ దక్షిణ ఫ్రాన్స్‌లో 2024 మే 14 నుండి 25 వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం ఈవెంట్‌ లో మెరిల్ స్ట్రీప్, డెమి మూర్, జార్జ్ లూకాస్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. అలాగే ఇండియా నుంచి ఐశ్వర్య రాయ్ బచ్చన్, అదితి రావ్ హైదరీ కేన్స్ 2024లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

కేన్స్ జ్యూరీ మెంబర్‌గా ఎంపికైన మొదటి భారతీయ మహిళా నటి ఐశ్వర్య. గతంలో ఆమె ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనేక ఐకానిక్‌ లుక్స్ లో కనిపించింది. 2022లో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అదితి అరంగేట్రం చేసింది. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రముఖులతో ఫ్రెంచ్ రివేరాలో తమ స్టైల్ ను చాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

కేన్స్ లోకి ఐశ్వర్య ఎంట్రీ..

ఐశ్వర్య రాయ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో కలిసి 2002లో చేసిన ‘దేవదాస్’లో నటిస్తున్నప్పుడే మొదటిసారిగా కేన్స్‌లో కనిపించింది. గత సంవత్సరం ఆమె సోఫీ కోచర్ బ్రాండ్ కు సంబంధించిన మెరిసే సిల్వర్ హుడ్ గౌనులో రెడ్ కార్పెట్ మీద నడిచింది.

కేన్స్ లో అదితి రావు హైదరి ఎంట్రీ..

కేన్స్ 2023లో అదితి రావు హైదరి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె పసుపు ఫ్లోర్-లెంగ్త్ గౌనులో అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోసారి ఈ ఏడాది కూడా అదితి రావు కేన్స్ లో మెరవబోతోంది.

సినిమాల విషయానికొస్తే.. ఐశ్వర్య చివరిసారిగా 2023లో మాగ్నమ్ ఓపస్ ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. మణిరత్నం రెండు భాగాలకు దర్శకత్వం వహించారు. ఆమె నెక్స్ట్ మూవీ గురించి ఇంకా క్లారిటీ లేదు.

అదితి రావ్ హైదరీ ఇటీవల విడుదలైన సంజయ్ లీలా భన్సాలీ ‘హీరమండి: ది డైమండ్ బజార్’లో కన్పించింది. ఆమె బిబ్బోజాన్ అనే వేశ్య పాత్రలో నటించింది. ఈ షోకు మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ అదితి పాత్రపై విమర్శకుల ప్రశంసలు కురిశాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు