Chiranjeevi: హద్దులు దాటిన చిరంజీవి స్థాయి.. ఏకంగా ఇంటర్నేషనల్ లెవల్లో.!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం వారి అభిమానులకే కాదు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమే.. ఆయన తన మేనరిజంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇకపోతే ఆయన తెలుగు సినిమాల వరకే పరిమితమైనా..ఆయన క్రేజ్ మాత్రం హద్దులు దాటి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగింది.. తన నటన, డాన్స్, ఫైట్స్ తో ఎంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.. ఇకపోతే సౌత్ సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు, కమల్ హాసన్ , రజినీకాంత్ వంటి నటులు ఉన్నప్పటికీ.. ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆస్కార్ కి ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ హీరోగా చిరంజీవి రికార్డుల్లో నిలిచారు.. స్వయంకృషితో అంతటి శిఖరాగ్రాన్ని చేరుకున్న చిరంజీవి జర్నీ ఎంతో మందికి ఆదర్శమని చెప్పవచ్చు..

ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని.. ఒక స్టూడెంట్ చైనా దేశంలోని ఒక స్కూల్లో తన క్లాస్ రూమ్ లో ఇన్స్పిరేషన్ స్టోరీని చెప్పుకు రావడం ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.. ఇంతకీ మరి ఆ స్టూడెంట్ ఎవరు ?ఆమెకు చిరంజీవి గురించి ఏం తెలుసు? ఆ స్టూడెంట్ చిరంజీవిని ఎందుకు అంతలా అభిమానిస్తుంది.. ? ప్రపంచంలో ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా నిలిచారు కదా.. ఆమె చిరంజీవినే ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంది ? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి..

వాస్తవానికి చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది పలు రంగాలలో సక్సెస్ అయిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగారు డాన్స్ కొరియోగ్రాఫర్ కొణతాల విజయ్.. అనకాపల్లి కి చెందిన ఈ డాన్స్ మాస్టర్.. చిరంజీవి డాన్సులు చూస్తూ పెరిగారు.. అలాగే ఆ డాన్సులకు స్ఫూర్తి పొంది చిన్నప్పటి నుంచే డాన్స్ వేయడం మొదలుపెట్టారు.. అలా స్కూల్ స్టేజి పోటీ నుంచి తెలుగు టీవీ చానల్స్ లోని రియాల్టీ షో ల వరకు చేరుకున్నాడు.. అక్కడ తన ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి వరకు ఎదిగాడు..

- Advertisement -

థాయిలాండ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఈయన.. కొందరు మిత్రుల ఆహ్వానంతో చైనా వెళ్లారు.. అక్కడ టీవీ చానల్స్ లో కొరియోగ్రాఫర్ గా మంచి స్థాయిని కూడా సంపాదించుకున్నారు.. ఈ కొణతాల విజయ్ కుమార్తె ఆ స్టూడెంట్.. తన తండ్రికి స్ఫూర్తి అయ్యి.. తన తండ్రి సక్సెస్ కి కారణమైన చిరంజీవి గురించి చైనా స్కూల్లో తన తోటి స్టూడెంట్స్ కి చెప్పి తన అభిమానాన్ని చాటుకుంది ఈ చిన్నారి.. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసి చిరంజీవి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయని చెప్పాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు