Chiranjeevi: నంది అవార్డ్స్ పేరు మార్చడం పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!

సినీ పరిశ్రమలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన సినీ సెలబ్రిటీలకు, కవులకు , రచయితలకు నంది అవార్డులను అందిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఏమైందో తెలియదు కానీ గత పది సంవత్సరాల నుంచి ఈ అవార్డులను ఇవ్వడం నిలిపివేశారు.. తాజాగా ఈ విషయాన్ని సినీ సెలబ్రిటీలు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లగా ఆయన ఈ విషయంపై పరిశీలించి.. ఇకపై నంది అవార్డ్స్ ను గద్దర్ అవార్డ్స్ గా పేరు మార్చి అందిస్తాము అంటూ వెల్లడించారు.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నంది అవార్డుకు గద్దర్ అని పేరు పెట్టడం సముచితమే అని తెలిపారు.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. రాజకీయాలలో మాట అనడం.. మాట పడడం తన వల్ల కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇదిలా ఉండగా.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలను హైదరాబాద్ శిల్ప కళా వేదికలో ఘనంగా సత్కరించింది. ఈ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, ఆనందచారి , కేతావత్ సోమలాల్, కూరెళ్ల విఠలాచార్యాలకు సత్కారం జరిగింది.

ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి నంది అవార్డుల పై కీలక వ్యాఖ్యలు చేశారు.. గత కొన్ని సంవత్సరాలుగా నంది అవార్డులు చరిత్ర లాగా మిగిలిపోయాయి. తమను నెగ్లెట్ చేస్తున్నారనే నిరుత్సాహం కళాకారులలో పెరిగిపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ధన్యవాదాలు.. నాతోపాటు ఈ పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన వెంకయ్య నాయుడుకి నా శుభాకాంక్షలు అంటూ తెలిపారు చిరంజీవి . ఇకపోతే రాజకీయాలు రాను రాను దుర్భాషలు , వ్యక్తిగత విమర్శలతో దిగజారిపోతున్నాయి.. వెంకయ్య నాయుడు లాంటి ఎంతో హుందాతనం వున్న వ్యక్తులు కూడా ప్రస్తుత రాజకీయాలను చూసి బాధపడుతున్నారు. మాట అనడం అనిపించుకోవడం నా వల్ల కాకనే రాజకీయాల్లో అన్ఫిట్ అనుకొని బయటకు వచ్చేసాను.. ఇక వ్యక్తిగత విమర్శలు చేసే వారిని, దుర్భాషలాడే వారిని, నోరు జారే వాళ్లను తిప్పికొట్టే శక్తి.. సరైన నాయకులను నిర్ణయించే శక్తి ..ప్రజలకు ఉందని అనుకుంటున్నాను అంటూ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు