Chiranjeevi: ఇప్పటివరకు చిరంజీవి అందుకున్న అవార్డ్స్ ఇవే..!

ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి.. పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించి..విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించి.. ఆ తర్వాత హీరో గా అడుగుపెట్టి ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో గా పేరు దక్కించుకున్న హీరో చిరంజీవి.. స్వయం కృషితో ఎదిగి నేడు మెగాస్టార్ గా చెలామణి అవుతున్నారు. 2006లో పద్మ భూషణ్ అందుకున్న ఈయన ఈ ఏడాది పద్మ విభూషణ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన తన సినీ కెరియర్లో అందుకున్న పురస్కారాల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

చిరంజీవి 1999 – 2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డును సొంతం చేసుకున్నారు.. ఇక 90లలో అత్యధిక పారితోషకం (రూ .1.25 కోటి) తీసుకున్న తొలి భారతీయ నటుడిగా కూడా పేరు గుర్తుంచుకున్నారు. స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర వంటి చిత్రాలకు ఏకంగా మూడుసార్లు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. అలాగే తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న చిరంజీవి 2016లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును కూడా అందుకున్నారు. ఇక 2022లో ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న చిరంజీవి.. 2006లో పద్మభూషణ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా పద్మ విభూషణ్ అవార్డు కూడా ఆయనను వరించింది.

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాకి మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది.. ఇక ముందుగానే చాలా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఈ సినిమాకి చాలా అవసరం పడుతుంది. కాబట్టి ముందుగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే టీజర్ ని రిలీజ్ చేయగా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి చిరంజీవి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తూ ఉండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు..

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు