Indian 2 : కమల్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన శంకర్… రిపబ్లిక్ డే వృథానే!

కమల్ హాసన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మూవీ “భారతీయుడు 2”. 1996లో వచ్చిన “భారతీయుడు” అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి, దేశానికి ద్రోహం చేసే వారిని క్షమించేది లేదంటూ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగ రాసిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, శంకర్ దర్శకత్వంలో “భారతీయుడు” సినిమాకు సీక్వెల్ పట్టాలెక్కబోతోంది అనే అప్డేట్ కమల్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. అయితే చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విషయంలో తాజాగా సినీ ప్రియులకు నిరాశ తప్పలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా భారతీయుడు 2 మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి అనౌన్స్మెంట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన వారికి శంకర్ షాక్ ఇచ్చాడు.

అవినీతి, లంచం, అక్రమార్జన అనే అంశాలను కీలకంగా తీసుకుని “భారతీయుడు 2” మూవీని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్జె సూర్య, బాబీ సింహ, బ్రహ్మానందం, సముద్రఖని వంటి పాపులర్ స్టార్స్ భాగం కావడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం సమకూర్చడం మరో ప్లస్ పాయింట్ కాబోతోంది. పలు వివాదాల అనంతరం ఎట్టకేలకు పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. 2024 వేసవి కానుకగా ఈ సినిమా థియేటర్లోకి రాబోతుందని వార్తలు వచ్చాయి. ఇక ఈ మూవీకి ఎక్కువ సమయం లేకపోవడంతో ఇప్పటినుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని అంతా భావించారు. అందులో భాగంగానే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఎదురు చూసినా ప్రేక్షకుల ఆశ నిరాశే అయింది.

ప్రస్తుతం శంకర్ చేతిలో “భారతీయుడు 2”, “భారతీయుడు 3”, “గేమ్ ఛేంజర్‌” వంటి మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటిలో “భారతీయుడు 2″ను వేసవిలో, “గేమ్ ఛేంజర్‌” మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ అని అన్నారు. ప్రస్తుతం “భారతీయుడు 2” షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మరోవైపు శంకర్ “గేమ్ ఛేంజర్‌” షూటింగ్ రీస్టార్ట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే రోజున “ఇండియన్ 2” సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం కొత్త అనుమానాలకు తెర తీసింది. ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉండడం వల్లనే మేకర్స్ ఇలా సైలెంట్ గా ఉన్నారని ప్రచారం స్టార్ట్ అయింది. మరి “భారతీయుడు 2” రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు