Trisha Krishnan : త్రిష ఎదుర్కున్న అతిపెద్ద వివాదాలు.. ఆరోజుల్లో సంచలనం?

Trisha Krishnan : సౌతిండియా స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. రెండు దశాబ్దాలు గా సౌత్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూ వరుస క్రేజీ సినిమాలతో బిజీ గా ఉంది. ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లయినా చెక్కు చెదరని అందంతో ఇప్పటికీ ఆకర్షిస్తుంది. అంతగా తన అందంతో కట్టిపడేస్తుంది. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే బిజీ గా ఉన్న ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. మరెన్నో వివాదాలలో ఇరుక్కుని వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడింది. అయితే అవన్నీ త్రిష కి ఒకరకంగా ప్లస్ పాయింట్ అయ్యాయి. అలా త్రిష కెరీర్ లో ఎదుర్కున్న వివాదాలు, తనని ఇబ్బంది పెట్టిన వార్తలు ఏంటో చూద్దాం. స్టార్ హీరోయిన్ గా ఉన్న త్రిష ని ఇప్పటివరకూ వెంటాడిన ఆ వివాదాలెంటో ఒకసారి గమనిద్దాం..

ఆ వివాదాలతో కెరీర్ కి డ్యామేజ్.?

మామూలుగా హీరోయిన్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్స్ అయ్యాక, ఒక సినిమా బ్లాక్ బస్టర్ పడి ఆ జోడి పెయిర్ బాగా ఆన్ స్క్రీన్ లో బాగా పండితే వాళ్లకి జత కట్టేసి వార్తలు రాసేయడం కామన్. ఈ ఇష్యూ త్రిష కెరీర్ లో ఎక్కువగానే జరిగింది. తెలుగులో త్రిష-ప్రభాస్‌ల ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌కు ఆడియన్స్‌ ఎక్కువ వేశారు. దాంతో బ్యాక్‌ టూ బ్యాక్ ప్రభాస్‌తో మూడు సినిమాలు తీసి హిట్‌ అందుకుంది త్రిష. వర్షం టైం లోనే వీళ్ళ మధ్య లవ్ మొదలైందని పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అదేమీ పట్టించుకోలేదు త్రిష. విచిత్రంగా అదే టైం లో తమిళ్ లో విజయ్ దళపతి తో వరుస హిట్లు కొట్టేసరికి ఆ జోడి కూడా పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఇక ఆ మధ్య టాలీవుడ్ నటుడు రానాతో కూడా కొన్నేళ్లు ఆఫ్ లైన్ లో ఎక్కువగా కనిపించేసరికి వీరు పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఇవేమి మరీ ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు. కానీ మధ్యలో అయితే మధ్యలో త్రిషను ఓ సంఘటన తీవ్రంగా కలిచి వేసింది.

కెరీర్ డౌన్.. అయినా ధైర్యంగా నిలబడింది..

అయితే స్టార్‌ హీరోయిన్‌ పీక్స్ లో ఉన్న టైం లో త్రిష న్యూడ్‌ వీడియో అంటూ ఫేక్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అప్పట్లో అది సంచలనం అయ్యింది. ఈ మధ్య రష్మిక ఎదుర్కున్న సంఘటన లాంటిది అని చెప్పొచ్చు. ఇక దీని తర్వాత కూడా త్రిష పలు వివాదాల్లో చిక్కుంది. ఒకటైంలో అర్థరాత్రి బాగా తాగి నడిరోడ్డుపై రచ్చ చేసిందంటూ త్రిష(Trisha Krishnan) వీడియో ఒకటి వార్తల్లో నిలిచింది. అది ఆమె సినీ కెరీర్‌ను దెబ్బతిసిందని కూడా చెప్పాలి. అప్పటి వరకు స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న త్రిష ఈ సంఘటనలతో డౌన్ అయింది. ఇక రీసెంట్ గా ఆరు నెలల కింద లియో సినిమాలో నటించిన త్రిష ఆ సినిమాలో నటించిన మన్సూర్ అలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు త్రిష ఎంత ఇబ్బంది పడిందో తెలిసిందే. ఆ సమయంలో టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెకు మద్దతుగా నిలిచి సపోర్ట్ చేసారు. అయితే వీటన్నిటిని ఎదుర్కొని కెరీర్ లో మళ్ళీ నిలబడింది త్రిష. ఇప్పుడు వరుస సినిమాలతో రీ ఎంట్రీ లోనూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తమిళ్ లో విదా మయుర్చి, థగ్ లైఫ్, అలాగే తెలుగులో విశ్వంభర వంటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు