Shobha Shetty: పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో వైరల్..!

Shobha Shetty..బిగ్ బాస్ వల్ల చాలామంది సెలబ్రిటీలు పుట్టుకొస్తూ ఉన్నారు.. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బాగానే ఫేమ్ వస్తోంది. మరి కొంతమంది ఫేమస్ అయిన తర్వాతే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తూ మరిన్ని అవకాశాలను సంపాదించుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి శోభాశెట్టి కూడా ఒకరు.. ఈమె గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్రలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది శోభా శెట్టి.. ఈమెకు శోభా శెట్టి కంటే మౌనిత అనే పేరు వల్లే బాగా పాపులారిటీ లభించింది.

Shobha Shetty: Bigg Boss beauty ready for marriage.. Video viral..!
Shobha Shetty: Bigg Boss beauty ready for marriage.. Video viral..!

నటుడు యశ్వంత్ తో ప్రేమాయణం..

గత ఏడాది బిగ్ బాస్-7 లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అందులో అందరూ ఆశ్చర్యపోయేలా తన ప్రియుడిని పరిచయం చేసింది. ఇక తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఇప్పుడు తాజాగా ఒక శుభవార్త తెలియజేస్తోంది.. కార్తీకదీపం సీరియల్ లో నటించిన యశ్వంత్ తో డేటింగ్ లో ఉన్నట్లు తెలియజేసింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కార్తీకదీపం సీరియల్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిం లలో కూడా కలిసి నటించడం జరిగిందట.

అప్పుడు జరిగింది పెళ్లిచూపులు మాత్రమే..

బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్లగానే.. శోభా శెట్టి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ విచ్చేసింది… సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలా ఏడాది మొదటిలో వీరిద్దరు ఫోటోలు చూసి వీరిద్దరికి నిశ్చితార్థం అయ్యిందేమో అని అందరూ ఆశ్చర్యపోయారు.. కానీ అప్పుడు జరిగింది కేవలం పెళ్లిచూపులని.. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభా శెట్టి.. దీంతో ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

నిశ్చితార్థ వీడియో వైరల్..

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు సైతం తెలియజేస్తున్నారు. అలా వీడియో అప్లోడ్ చేసిందో లేదో ఈ వీడియో క్షణాలలో వైరల్ గా మారుతుంది. అయితే పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదని తెలుస్తోంది.త్వరలోనే ఆ విషయాన్ని కూడా తెలియజేస్తుందేమో చూడాలి మరి శోభా శెట్టి. మొత్తానికైతే సీరియల్ ద్వారా తన ప్రేమను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో తన ప్రేమను రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి సిద్ధమయింది శోభా శెట్టి..

బిజినెస్ మొదలుపెట్టిన శోభా శెట్టి..

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శోభాశెట్టికి కార్తీకదీపం 2 సీరియల్ లో అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ ఈమెకు అవకాశం బిగ్ బాస్ వల్లే పోయిందనే ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం సారీ బిజినెస్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అక్కడే తన ఆదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు