Toxic: యష్ మూవీ నుంచీ బాలీవుడ్ భామ ఔట్.. అసలేమైందంటే..?

Toxic.. కే జి ఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్లో తన స్టార్డమ్ ని నిలబెట్టుకున్నారు కన్నడ హీరో యష్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా టేకింగ్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది.. ఈ సినిమా విడుదలైన తర్వాత దాదాపుగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న యష్.. ఆ తర్వాత యష్ ప్రముఖ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో టాక్సిక్ అనే సినిమాని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఈ సినిమా పైన ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీ తో పాటు ఇతర ఇండస్ట్రీలో కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతోందని వార్తలు వినిపించాయి.

Toxic: Bollywood Bhama is out of Yash movie.. What is it?
Toxic: Bollywood Bhama is out of Yash movie.. What is it?

కరీనా కపూర్ స్పందన..

గతంలో ఈ విషయాన్ని కూడా స్వయంగా కరీనాకపూరే తెలియజేసింది.. సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నానని అది కూడా ఒక స్టార్ హీరో చిత్రం.. పాన్ ఇండియా చిత్రం అన్నట్లుగా తెలియజేసింది. ఇందుకోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నానని కూడా వెల్లడించింది కరీనాకపూర్.. అయితే ఇప్పుడు తాజాగా చిత్ర యూనిట్ కి ఒక పెద్ద షాక్ ఇస్తూ.. కరీనాకపూర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి ఈ చిత్రంలో కరీనాకపూర్ చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

అభిమానులకు షాక్ ఇచ్చిన కరీనా..

ఇలా ఇద్దరూ కూడా వెండితెర పైన కనిపిస్తారు అనుకుంటున్న సమయానికి చిత్ర బృందం తో పాటు అభిమానులకు కూడా ఒక పెద్ద షాక్ ఇచ్చింది కరీనాకపూర్. కరీనాకపూర్ స్థానంలో ఇప్పుడు నయనతారని అనుకుంటున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి కథను కూడా డైరెక్టర్ గీతు మోహన్ దాస్ నయనతార కు చెప్పినట్లు సమాచారం. నయనతార కూడా ఈ సినిమా చేయడానికి కాస్త ఒప్పుకునేలా కనిపిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

టాక్సిక్ మూవీ ని రిజెక్ట్ చేసిన కరీనాకపూర్..

టాక్సిక్ సినిమాలో యష్ చెల్లెలి పాత్రకు కూడా మంచి స్కోప్ ఉందని.. ఈ పాత్రకి కూడా స్ట్రాంగ్ నటి కావలసి ఉండగా అందుకే కరీనాకపూర్ ని ముందు సంప్రదించగా .. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రస్తుతం కరీనాకపూర్ చేతిలో ఎక్కువ సినిమాలు ఉండడం చేత రిజెక్ట్ చేసినట్లు సమాచారం..

నయనతార ఒప్పుకుంటుందా..

మళ్లీ నయనతారను సంప్రదించినట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉన్నది. గత ఏడాది డిసెంబర్ నెలలో కేవలం టైటిల్ లాంచ్ ని మాత్రమే తెలియజేశారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. మరి ఇలాంటి సమయంలో కరీనాకపూర్ కూడా సినిమా నుంచి వెళ్ళిపోయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి మరి నయనతార నిజంగానే యష్ కి చెల్లెలుగా నటిస్తుందా ? లేక సినిమా నుంచీ ఈమె కూడా తప్పుకుంటున్న అన్న అనుమానాలు మొదలయ్యాయి మరి పూర్తి వివరాలు తెలియాలి అంటే చిత్ర బృందం ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిందే..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు