Sushmita: ఆ స్టార్ హీరోయిన్ పై పగబట్టిన చిరు డాటర్.. చివరికి.!

Sushmita.. మెగాస్టార్ చిరంజీవి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తోందని అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెడుతోంది ఈ ముద్దుగుమ్మ..ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఒక హీరోయిన్ ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూసిందట. అయితే ఆ హీరోయిన్ పై ఆమెకు ఎందుకంత పగో అర్థం కావడం లేదు.. మరి అసలు విషయాలు ఇప్పుడు చూద్దాం..

Sushmita: The little daughter who resented the star heroine.. in the end..!
Sushmita: The little daughter who resented the star heroine.. in the end..!

ఆ హీరోయిన్ పై సుస్మితకి ఎందుకంత పగ..

మెగా డాటర్ సుస్మిత కి ఇష్టం లేని హీరోయిన్ కేథరిన్ థ్రెసా అని అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే అసలు కారణం ఏంటి అంటే చిరంజీవి రీయంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత స్టైలిస్ట్ గా పనిచేసింది . అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ రత్తాలు రత్తాలు పాటకి మొదట్లో కేథరిన్ థ్రెసా ను ఎంపిక చేశారట చిత్ర బృందం.. కానీ సినిమా షూటింగ్ జరిగే సమయంలో అటు కేథరిన్ కి ఇటు సుస్మిత కి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని సమాచారం.. దాంతో ఈ సినిమా నుంచీ కేథరిన్ తప్పుకున్నట్లు కొన్ని వార్తలు వినిపించాయి.. ఆ తర్వాత ఆ సినిమాలో ఐటెం సాంగ్ కోసం లక్ష్మీరాయ్ ని బరిలోకి దింపారు.

రూమర్స్ కి చెక్..

ఈ విషయం కాస్త పక్కన పెడితే కేథరిన్ ఈ సినిమా నుండి తప్పుకున్న సమయంలో సినిమా షూటింగ్ సెట్లోనే కేథరిన్ , సుస్మిత ఇద్దరు కూడా బాగా వాగ్వాదానికి దిగారు అని.. ఆ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రాకుండా సుస్మిత చేసిందని వార్తలు కూడా వినిపించాయి.. అయితే ఆ వార్తలన్నింటికీ తెరపడేలా కేథరిన్ థ్రెసా జయ జానకి నాయిక సినిమాలో ఐటం సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే. ఇకపోతే అప్పటివరకు కేథరిన్ సుస్మిత మధ్య గొడవలు ఉన్నాయని.. సుస్మిత.. కేథరిన్ కు అవకాశాలు రాకుండా ఆమె జీవితాన్ని నాశనం చేయాలనుకుంది అన్న వార్తలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది..

- Advertisement -

కేథరిన్ తెలుగు సినిమాలు..

కేథరిన్ థ్రెసా తెలుగు సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలు సినిమా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఈ సినిమాలో తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకున్న ఈమె మరొకసారి అల్లు అర్జున్ తో కలిసి సరైనోడు చిత్రంలో కూడా నటించింది.. ఇందులో ఎమ్మెల్యే క్యారెక్టర్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది కేథరిన్.. ఇక అలాగే పలు తెలుగు చిత్రాలలో నటించిన ఈమె ఆ తర్వాత మళ్లీ ఐటెం సాంగ్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇక హీరోయిన్గా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు.. మరి కేథరిన్ మళ్లీ అవకాశాలను దక్కించుకొని పూర్వ వైభవాన్ని పొందుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు