Kareen Kapoor Exits Toxic Movie :అప్పుడు త్రిప్తి, ఇప్పుడు కరీనా… ఆ రోల్ అంటే హీరోయిన్లు ఎందుకు భయపడుతున్నారంటే?

Kareen Kapoor Exits Toxic Movie : కేజిఎఫ్ మూవీతో ఫాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీ నుంచి హీరోయిన్ కరీనా కపూర్ తప్పుకుంది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే పాత్రకు ఓకే అనుకున్న మరో హీరోయిన్ త్రిప్తీ, ఇప్పుడు కరీనా ఇద్దరూ ఆ పాత్ర నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి? అంటే…

కరీనాకు కథ తెలియదా?

కేజిఎఫ్ రెండు పార్ట్ ల తరువాత యష్ ఇప్పటి దాకా మరో కొత్త మూవీలో కనిపించలేదు. కొన్ని నెలల కిందట చేయబోతున్నట్టు టాక్సిక్ అనే మూవీ చేయబోతున్న వెల్లడించారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కేవీఎన్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. 1960లో నేపథ్యంలో గోవాలోని డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథగా టాక్సిక్ రాబోతుందని టాక్ నడుస్తోంది.

ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ యష్ సోదరిగా కనిపించబోతుందని వార్తలు వచ్చాయి. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది అని వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే కరీనా కపూర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అనే రూమర్లు బయలుదేరాయి. దీనిపై టాక్సిక్ టీం ఇంకా స్పందించలేదు.

- Advertisement -

తాజాగా కరీనా కపూర్ డేట్స్ కుదరడం లేదంటూ టాక్సిక్ నుంచి తప్పుకుందని, క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆమె మూవీకి గుడ్ బై చెప్పేసింది అని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈ మూవీ నుంచి ఆమె తప్పుకోవడానికి అసలు కారణం ఏంటంటే…

కరీనా, త్రిప్తీ వెనకడుగుకు ఇదే కారణం 

ప్రధాన పాత్రలో నటిస్తున్న కరీనాకు ఈ మూవీ బ్యాక్ డ్రాప్ కంటెంట్ గురించి తెలియదని సమాచారం. డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న టాక్సిక్ లో LGBTQ+ థీమ్‌లతో సహా పలు డార్క్ అండ్ డీప్ ఇష్యూస్ ను టాక్సిక్ లో చూపించబోతున్నారట. దీంతో మూవీ చేశాక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండడంతో కరీనా వెనకడుగు వేసిందని తెలుస్తోంది. గతంలో ఇదే పాత్రకు యానిమల్ హీరోయిన్ త్రిప్తీ దిమ్రిని అనుకున్నారు. కానీ ఆమె ఈ పాత్రను తిరస్కరించినట్టు సమాచారం. ఆ తర్వాత కరీనా రంగంలోకి దిగింది. కానీ తాజాగా మూవీ బ్యాక్ డ్రాప్ గురించి తెలుసుకున్న కరీనా కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకుంది అనే వార్తలు మొదలయ్యాయి. 

దీంతో ఈ మూవీ విషయంలో అసలు ఏం జరుగుతుంది అనే గందరగోళం నెలకొంది యష్ ఫ్యాన్స్ లో. కాగా గత కొన్ని నెలల నుంచి మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. గతేడాది డిసెంబర్లో టైటిల్ లాంచ్ తప్ప ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాలేదు. కనీసం ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి కూడా ఆడియన్స్ కి సమాచారం ఇవ్వలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు