Leela Naidu: 14 ఏళ్లకే మిస్ ఇండియాగా తెలుగమ్మాయి.. కానీ చివరికి..!

Leela Naidu.. ప్రపంచంలో ఎంతోమంది అందగత్తెలు.. అందులో కొంతమంది అన్ని విషయాలలో ఉన్నతంగా బ్రతికితే.. మరి కొంతమంది వివిధ కారణాలవల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలి.. ఇందులో చాలా మంది హీరోయిన్లు తమ అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు.. అలా దాదాపు పదేళ్లు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో చేదు అనుభవాలే మిగిలాయి. ఆమె ఎవరో కాదు లీలా నాయుడు అచ్చ తెలుగు అమ్మాయి.. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీ అందానికి దాసోహం అయ్యింది.. 14 ఏళ్లకే మిస్ ఇండియా విజేతగా నిలిచింది.

Leela Naidu: Became Miss India at the age of 14.. But in the end..!
Leela Naidu: Became Miss India at the age of 14.. But in the end..!

ప్రేమ, పెళ్లి జీవితాన్ని నాశనం చేశారు..

అంతేకాదు ఈమె అందానికి మంత్రముగ్ధుడైన రాజ్ కపూర్ ఏకంగా నాలుగు సార్లు ఆఫర్లు ఇచ్చారు.. తొలి చిత్రానికి జాతీయ అవార్డు అందుకుంది. కానీ సినిమా అనే ఈ రంగుల ప్రపంచం లో ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్ని ఒంటరిని చేశాయి.. తట్టుకోలేక మానసిక వేదనకు గురైంది.. ఆ బాధ నుంచి బయటపడడానికి మద్యానికి బానిస అయ్యి 2009లో స్వర్గస్తురాలయ్యింది..

లీలా నాయుడు జీవిత విశేషాలు..

ఈమె తండ్రి చిత్తూరు జిల్లా మదనపల్లి కు చెందిన భౌతిక శాస్త్రవేత్త పత్తిపాటి రామయ్య నాయుడు.. ప్యారిస్ లోని UNESCO శాస్త్ర సలహాదారుగా పనిచేస్తున్న సమయంలో అక్కడే పరిచయమైన ఫ్రెంచ్ కు చెందిన మార్తాను ఆయన వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరి సంతానమే లీలా నాయుడు… ముంబైలో జన్మించిన లీల స్విట్జర్లాండ్ లో విద్యాభ్యాసం పూర్తి చేసింది .చిన్నప్పుడే నటన మీద ఆసక్తి ఉండడంతో ఫ్రెంచ్ నటుడు జీన్ రేనా దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. కేవలం 14 ఏళ్ళ వయసులోనే ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఈమె అదే సమయంలో ఆక్స్ ఫర్డ్ లో చదువుతున్న లీలాకు రాజ్ కపూర్ నాలుగు సార్లు అవకాశం ఇవ్వగా ఆమె చదువు కారణంగా రిజెక్ట్ చేసిందట..

- Advertisement -

లీలా నాయుడు వివాహం..

లీలా నాయుడు ఎంత అందంగా ఉండేవారు అంటే ఈమె అందానికి ముగ్ధుడైన ఒబెరాయ్ హోటల్ గొలుసు యజమాని మోహన్ ఒబెరాయ్ కుమారుడు తిలక్ రాజ్ లీలాను వివాహం చేసుకున్నారు. పెళ్లినాటికి ఈమె వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే.. అయితే తిలక్ రాజు మాత్రం లీలా కంటే వయసులో 16 సంవత్సరాలు పెద్దవాడు.. కానీ రెండేళ్లకే వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు.. అదే సమయంలోనే గర్భవతి అయిన ఈమె పిల్లలకు జన్మనివ్వగా .. ఆ పిల్లల సంరక్షణను తిలక్ తీసుకోవడం జరిగింది.. ఆ తర్వాత రచయిత డోమ్ మోరియాస్ ను రెండో వివాహం చేసుకుంది కానీ కొన్నాళ్లకే వీరి బంధం కూడా ముగిసిపోయింది.. రెండో పెళ్లి విడాకుల కారణంగా మానసిక క్షోభను అనుభవించి ప్రపంచానికి దూరంగా ఉండాలని ఒక విలాసవంతమైన భవనంలో ఒంటరిగా జీవించింది.. ఇక సంపాదించిన ఆస్తి మొత్తం పోయింది.. పేదరికం ఒంటరితనంతో 2009 జూలై 8 న ఊపిరితిత్తుల కారణంగా మరణించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు