Harihara Veeramallu : ఈ రెండు కారణాల వల్లే రెండు భాగాలుగా తీస్తున్నారట!

HariHara Veeramallu : టాలీవుడ్ లో చాలా కాలంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు నాలుగేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకోవడానికే నానా తంటాలు పడుతుంది. ఈ సినిమా తర్వాత మొదలైన సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయిపోయాయి. కాని హరిహరవీరమల్లు మాత్రం ఇంకా తెరకెక్కుతూనే ఉంది. దానికి సవాలక్షా కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా పవన్ రాజకీయాల్లో బిజీ అవడమే అని చెప్పొచ్చు. కానీ ఎలాగైనా సరే ఈ సినిమాను పూర్తి చేసి సెప్టెంబర్ లోగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి కొన్ని కారణాల వల్ల దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోగా, ఆ బాధ్యతలని జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా హరిహరవీరమల్లు టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

రెండు భాగాల్లో వీరమల్లు..!

ఇక హరిహర వీరమల్లు టీజర్ ఫ్యాన్స్ దగ్గరి నుండి మంచి రెస్పాన్స్ ని అందుకుంది కానీ, కామన్ ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్స్ చేయలేదని అనిపిస్తుంది. యూట్యూబ్ లో కూడా పెద్దగా రికార్డులు నమోదవ్వలేదు. టీజర్ లో కథకి సంబంధించిన అంశాలని చెప్తూ, మెల్లిగా పవన్ కళ్యాణ్ ని రివీల్ చేసిన విధానం బాగుంది. ఇదిలా ఉండగా టీజర్ ద్వారా హరిహర వీరమల్లు సినిమా రెండు పార్ట్ లలో ఉండపోతుంది అని టీజర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇంతకు ముందు వచ్చిన అప్డేట్స్ లో గాని, టీజర్ లోగాని రెండు పార్ట్ లు ఉంటుందని చెప్పలేదు. కానీ సడన్ గా ఈ ఛేంజ్ ఎందుకు అయ్యారో అని, రెండు పార్ట్ లు ఎందుకు తీస్తున్నారో అని నెటిజన్లకు సందేహం వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా లేట్ అయ్యే కొద్దీ సినిమాపై అంచనాలు తగ్గుతున్నాయని కొందరు అంటున్నారు. రెండు పార్ట్ ల విషయంలో ఫ్యాన్స్ కూడా అవసరమా అన్నట్టు ఉన్నారని టాక్ నడుస్తుంది.

ఈ కారణాల వల్లే రెండు పార్ట్స్..

అయితే హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా రెండు పార్ట్ లు గా తెరకెక్కుతుండటం పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతుండటం పట్ల రెండు కారణాల్లో ఏవైనా ఉండొచ్చని సమాచారం. మొదటిది ఈ సినిమా బడ్జెట్. నాలుగు సంవత్సరాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రెండు వందల కోట్లు అనుకోగా ఇప్పుడు 300 కోట్ల దాకా అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకే రెండు భాగాలుగా తీసి కాస్త ఎక్కువ డబ్బులు వెనకేసుకోవాలని మేకర్స్ చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా లెంగ్త్ కూడా ఇప్పటికే మూడున్నర గంటలు దాటిందట. కాబట్టి కథ మరో గంట పాటు నిడివి పెంచి రెండు భాగాలుగా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుండే తెలియాలి. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు