HariHara Veeramallu : చాలా రోజులకు ఫస్ట్ టైం.. ఒక్క రికార్డు కూడా నమోదుకాలేదు

HariHara Veeramallu : టాలీవుడ్ లో చాలా కాలంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దాదాపు నాలుగేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకోవడానికే నానా తంటాలు పడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాల లైనప్ లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. దీని తర్వాత మొదలైన సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అయిపోయాయి. కాని హరిహరవీరమల్లు మాత్రం ఇంకా తెరకెక్కుతూనే ఉంది. దానికి సవాలక్షా కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా పవన్ రాజకీయాల్లో బిజీ అవడమే అని చెప్పొచ్చు. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన సమయాన్ని సినిమా కోసం కేటాయించలేకపోతున్నారు. కానీ ఎలాగైనా సరే ఈ సినిమాను పూర్తి చేసి సెప్టెంబర్ లోగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి కొన్ని కారణాల వల్ల దర్శకత్వ బాధ్యతల నుండి తప్పుకోగా, ఆ బాధ్యతలని జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా హరిహరవీరమల్లు టీజర్ రిలీజ్ అయిందన్న సంగతి తెలిసిందే.

అంచనాలను అందుకోలేదా?

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ చేయగా, ఫ్యాన్స్ దగ్గరి నుండి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. అయితే కామన్ ఆడియన్స్ ని అంతగా ఇంప్రెస్స్ చేయలేదని అనిపిస్తుంది.టీజర్ లో పవన్ కళ్యాణ్ లోని ప్లస్ ఎలిమెంట్స్ అన్ని తీసుకొని పర్ఫెక్ట్ గా చూపించారు మేకర్స్. టీజర్ లో కథకి సంబంధించిన అంశాలని చెప్తూ, మెల్లిగా పవన్ కళ్యాణ్ ని రివీల్ చేసిన విధానం ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ టీజర్ లో వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక టీజర్ ద్వారా సినిమా రెండు పార్ట్ లలో ఉండపోతుంది అర్ధమవుతుంది. కానీ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ మార్క్ లో అంతగా రెస్పాన్స్ తెచ్చుకోలేదని అనిపిస్తుంది.

రికార్డులు మిస్..

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు (HariHara Veeramallu) సినిమా టీజర్ నిన్న ఉదయం 9 గంటలకు రిలీజ్ కాగా సోషల్ మీడియా లో మంచి రెస్పాన్స్ నే అందుకుంది. కాని పవన్ కళ్యాణ్ సినిమాలకి వచ్చే రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదని చెప్పాలి. యూట్యూబ్ లో ఒక్క రికార్డు కూడా నమోదు కాలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మామూలుగా పవన్ కళ్యాణ్ నుండి ఏ సినిమా టీజర్ రిలీజ్ అయినా నిమిషాల వ్యవధిలో లక్షల్లో లైక్స్, గంటల్లో వ్యూస్ వస్తాయి. కానీ అసలు పవన్ నుండి టీజర్ రిలీజ్ అవుతుందని కూడా చాలా మందికి తెలియని నేపథ్యంలో ఈ సినిమా టీజర్ అంచనాలని అందుకోలేదని చెప్పాలి. ఇప్పటివరకు 3 మిలియన్ల వ్యూస్ 255k లైక్స్ మాత్రమే వచ్చాయి. ఏది ఏమైనా ఆన్లైన్ లో ఎలా ఉన్నా, థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ సినిమాలకి ఉండే జోషే వేరని చెప్పాలి. అయితే ఈ సినిమా ఈ ఇయర్ రిలీజ్ అవుతుందా అంటే గ్యారెంటీ లేదని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత ఓజి లేదా, ఈ సినిమానే ముందు పూర్తి చేయొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు