Devi Sri Prasad Strong Comeback: దేవి శ్రీ ప్రసాద్ నామ సంవత్సరం

Devi Sri Prasad Strong Comeback: సినిమాల్లో సంగీతం ఎంత పెద్ద కీలకపాత్రను పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మామూలు సీన్ ని కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అద్భుతమైన సీన్ గా చూపించవచ్చు అని ప్రతి దర్శకుడికి తెలుసు. అయితే ఒక సినిమా హిట్ అవ్వాలంటే మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా వరకు ఆడియన్ రావాలి అంటేనే ఆ సినిమా యొక్క సాంగ్స్ మార్కెట్లో గట్టిగా వినిపించాలి. ఆ సాంగ్స్ నచ్చితే ఆ సాంగ్స్ ని చూడాలని ఆసక్తి ఆడియన్స్ కి కలగాలి. ఆ తర్వాత థియేటర్ కి వచ్చి ఆ సాంగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడంతో పాటు, సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కూడా ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో దేవిశ్రీప్రసాద్ ఒకరు. దేవి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంగీత దర్శకుడుగా పరిచయం అయ్యాడు దేవిశ్రీప్రసాద్. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఒక టైం లో పీక్ రేంజ్ లో సంగీతాన్ని అందించాడు. దేవి మ్యూజిక్ అంటేనే ఒక బ్రాండ్ గా ఏర్పడింది. అద్భుతమైన సాంగ్స్ ను అందించడమే కాకుండా బీభత్సమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా అందించాడు దేవి శ్రీ ప్రసాద్.

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి ఎందరో స్టార్ హీరోలుకు కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించాడు దేవి. ఒక టైం లో వెంకీ, పౌర్ణమి, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, శంకర్ దాదా ఎంబిబిఎస్ లాంటి సినిమాలు అద్భుతమైన హిట్ లుగా నిలిచాయి అంటే దీనికి కారణం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అని కూడా చెప్పొచ్చు. ఒక టైంలో దేవిశ్రీప్రసాద్ హవా కొంత తగ్గింది అని మనకు తెలిసిందే. ఒక టైం లో ఎస్ ఎస్ తమన్ వరుస బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ చేస్తూ స్టార్ హీరోలతో పనిచేశాడు.

- Advertisement -

ఇక ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ విషయానికొస్తే రీసెంట్ టైమ్స్ లో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గట్టిగా వినిపిస్తుంది. వీటిని మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అదిరిపోయింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం దేవి లైన్ లో పుష్ప , కుబేర సినిమాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన రత్నం సినిమా మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. అలానే ఆ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కూడా అద్భుతంగా చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఇకపోతే దేవి ఎంతమందితో పనిచేసిన కూడా సుకుమార్ కి మ్యూజిక్ చేసినప్పుడు మాత్రం ఇంకా అత్యద్భుతంగా ఇస్తాడు అని చెప్పొచ్చు.

దీనికి కారణం వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్. ఇప్పటివరకు సుకుమార్ ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయలేదు. ఇకపోతే రీసెంట్ గా కుబేర అనే సినిమా నుంచి నాగార్జున టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందర్నీ బీభత్సంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే సినిమాలన్నీ పర్ఫెక్ట్ గా వర్క్ అంటే అయితే ఈ సంవత్సరాన్ని దేవిశ్రీ నామ సంవత్సరం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు