Chiranjeevi: పద్మ విభూషణుడిగా చిరంజీవి..!

Chiranjeevi:  గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పద్మ పురస్కారాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సెలబ్రిటీలకు పద్మ అవార్డులను ప్రకటించి తెలుగువారి ఆనందానికి కారణమైంది కేంద్ర ప్రభుత్వం.. వెండితెర పై స్వయంకృషితో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిరంజీవికి ఇది అత్యున్నత రెండవ పౌర పురస్కారము అని కూడా చెప్పవచ్చు.. కళా రంగానికి చేసిన సేవలకు గాను ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి అందిస్తోంది.

రాజకీయాలలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి .. ఆ తర్వాత రాష్ట్రపతి గా ఎదిగిన వెంకయ్య నాయుడు కూడా ఈ పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. దీంతో తెలుగు ప్రజలు వీరికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. వీరిద్దరితోపాటు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన వారిలో సామాజిక సేవా రంగం నుంచి బిందెశ్వర్ పాఠక్ (బీహార్).. పద్మ సుబ్రహ్మణ్యం (తమిళనాడు).. కళా రంగం నుంచి వైజయంతి మాల బాలి (తమిళనాడు)..ఇలా మొత్తం ఐదుగురు పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే.. వెండితెర మీద 1978లో తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఆయన మొదటిసారి పునాదిరాళ్లు అనే సినిమాతో హీరో గా మారారు. అయితే చిరంజీవికి స్టార్డం తెచ్చి పెట్టిన సినిమా మాత్రం 1983లో వచ్చిన ఖైదీ సినిమా.. ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా చిరంజీవి కెరీర్ మలుపు తిరిగింది.. మెగాస్టార్ గా మూడు దశాబ్దాల క్రితమే మంచి స్థారడంని అందుకున్నారు చిరంజీవి. ఇప్పటివరకు కూడా అదే స్టార్ స్టేటస్ ని కొనసాగిస్తూ తిరుగులేని హీరోగా పేరు సంపాదించి.. 155 కి పైగా సినిమాలలో నటించారు.

- Advertisement -

చిరంజీవి తన పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి.. పలు రకాల సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ ఉంటారు. అటు నటుడుగా ఇటు ప్రజా సేవకుడుగా కూడా పేరు దక్కించుకున్నారు. మరొకవైపు రాజకీయాలలో కూడా కొద్ది రోజులు రాణించినప్పటికీ.. కొన్ని కారణాల చేత రాజకీయాల నుంచి వైదొలిగారు.ఇప్పుడు చిరంజీవి కి పద్మ విభూషణ్ అవార్డు దక్కడం పట్ల తెలుగుజాతి గర్విస్తోంది అంటూ అభిమానులు తెలుపుతున్నారు. అటు వెంకయ్య నాయుడు కి, ఇటు చిరంజీవికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు