Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డిలో అల్లు అర్జున్.. సందీప్ ఏమన్నారంటే..?

అర్జున్ రెడ్డి.. సంవత్సరాల తరబడి ప్రేక్షకులలో గుర్తిండిపోయే సినిమా అని చెప్పవచ్చు. అర్జున్ రెడ్డి సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ.. అసలు ఈ సినిమా విజయ్ దేవరకొండ కోసమే తీశారా అన్నట్టు అనిపిస్తుంది.. అంతలా ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కి జీవం పోసారు విజయ్ దేవరకొండ.. ఇక ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా కూడా మిగిలింది. ఇప్పుడు టాలీవుడ్ లో వస్తున్న చాలా సినిమాలలో చూపించే బోల్డ్ సన్నివేశాలు కూడా ఈ సినిమా నుంచే పుట్టుకొచ్చాయి.అంతలా ఈ సినిమా ప్రేక్షకుల మది లో నిలిచిపోయిందని చెప్పవచ్చు.

ఈ సినిమాతో రాంగోపాల్ వర్మ తర్వాత అంతటి సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నారు సందీప్ రెడ్డి వంగ.ఇదే కోణంలో యానిమల్ సినిమా చేసి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ కాదు అంటూ సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్లు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..వాస్తవానికి అర్జున్ రెడ్డి సినిమా చూసిన ఎవరైనా సరే సందీప్ రెడ్డి.. విజయ్ దేవరకొండను మైండ్ లో పెట్టుకొని ఆ క్యారెక్టర్ రాసినట్టు అనిపించక మానదు.. అయితే దర్శకుడు మాత్రం కథ రాసేటప్పుడు తన మైండ్లో అసలు విజయ్ దేవరకొండ లేరని.. తాను అల్లు అర్జున్ ని ఊహించుకొని కథ రాశాను అంటూ తెలిపారు.

వాస్తవానికి గతంలో అర్జున్ రెడ్డి సినిమాను అల్లు అర్జున్ ను మైండ్ లో పెట్టుకొని రాశాను అంటూ సందీప్ రెడ్డి వంగా వెల్లడించిన విషయం తెలిసిందే.. ఇక ఈమధ్య వచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఆయన దాని గురించి ప్రస్తావించారు. అల్లు అర్జున్ ని ఊహించుకుంటూనే ఆ పాత్ర, కథ మొత్తం రాశాను.. అయితే ఈ కథను అల్లు అర్జున్ కి చెప్పాలని ప్రయత్నించాను.. కానీ కుదరలేదు.. ఇక అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ సాధించడం తో.. వెళ్లి అల్లు అర్జున్ ని కలిసి వేరే కథ కూడా ఒకటి చెప్పాను. కానీ అప్పుడు డేట్స్ కుదరలేదు.. త్వరలోనే కచ్చితంగా మా కలయికలో సినిమా ఉంటుంది.. అంతేకాదు బన్నీ కోసం ప్రత్యేకంగా ఒక కథ కూడా రాస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగా..

- Advertisement -

ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో స్పిరిట్ సినిమా కథ పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా ఉంటుంది. ఈ రెండు తెరపైకి వచ్చిన తర్వాతనే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు