Sandeep Reddy Vanga: వెళ్ళి ని మాజీ మొగుడ్ని అడుగు – కిరణ్ రావు పై సందీప్ వంగ ఫైర్..!

Sandeep Reddy Vanga

సందీప్ రెడ్డి వంగ.. యానిమల్ సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ లభించింది. అటు బాలీవుడ్‌లో కూడా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇదిలా ఉండగా సందీప్ రెడ్డి తాజాగా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు పై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నారు. సాధారణంగా సందీప్ రెడ్డి వంగాకు సినిమాలు బాగా తీయడంలోనే కాదు విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ లు ఎలా ఇవ్వాలో కూడా బాగా తెలుసు. చాలామంది ఈయనకు బలుపు అంటే మరికొంతమంది అలాంటి సినిమాలు తీయాలంటే ఈ మాత్రం బలుపు ఉండాల్సిందే అంటారు.

ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా ఓటీటీలోకి వచ్చాక ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఫీమేల్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాధిక, కస్తూరి, తాప్సీ ఇలా ఒక్కొక్కరుగా యానిమల్ పై విమర్శలు గుప్పిస్తుంటే.. ఈ లిస్టులోకి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా చేరిపోయింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. బాహుబలి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది.

దీంతో సందీప్ రెడ్డి వంగా కూడా తనదైన స్టైల్ లో కిరణ్ రావు వ్యాఖ్యలపై ఖండించారు. ఇక ఆయన మాట్లాడుతూ కిరణ్ రావు పేరు బయటకు తీసుకురాకుండా ఇలాంటి కామెంట్స్ చేశారు. “ఆమె అన్న వ్యాఖ్యలు నేను విన్నాను. ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ వద్దకు వెళ్లి అడగమనండి… ఆయన నటించిన దిల్ సినిమాలో హీరోయిన్ ను రేప్ కి ప్రేరేపించేలా ఎలా చేశాడో.. అది కూడా ఆమె తప్పు చేసిందని నమ్మిస్తాడు.. చివరికి ఆ అమ్మాయి హీరోనే ప్రేమిస్తుంది.. మరి ఇదంతా ఏమిటి.. ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు” అంటూ తనదైన స్టైల్ లో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు సందీప్ వంగా..

- Advertisement -

ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఇటీవల రణబీర్, రష్మిక మందన్న కాంబినేషన్లో వచ్చిన బోల్డ్ అండ్ యాక్షన్ చిత్రం యానిమల్.. ఈ సినిమాలో రణబీర్, త్రిప్తి దిమ్రి మధ్య వచ్చే బోల్డ్ సన్నివేశాలకు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సినిమాలో ఇంత బోల్డ్ కంటెంట్ అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకోవడమే కాదు.. ఏకంగా రూ.900 కోట్ల కి పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. ఏది ఏమైనా ఈ సినిమా బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సృష్టించిన సినిమా జాబితాలో ఒక్కటిగా చేరిపోయింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు