Poonam Pandey Death: పూనమ్ మృతిపై సందేహాలు.. డెడ్ బాడీ మిస్..!

Poonam Pandey Death

పూనమ్ పాండే రియల్ అనే ఇంస్టాగ్రామ్ పేజ్ లో ప్రముఖ మోడల్ , బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించినట్లు ఒక పోస్టు అందరిలో కలకలం సృష్టించింది. అందులోనూ ఆమె గర్భాశయ కాన్సర్ తో చనిపోయారని మేనేజర్ ప్రకటించడం ఇప్పుడు మరింత ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పవచ్చు. దీంతో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు, వీడియోలే వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లంతా కూడా ఓం శాంతి, రిప్ , అయ్యో పాపం అంటూ పోస్ట్లు పెడుతూ సానుభూతి ప్రకటిస్తున్నారు.

అయితే ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు అందరిలో కూడా సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. పూనమ్ పాండే నిజంగానే చనిపోయిందా ..? అనే చర్చ తెరపైకి వచ్చింది.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎవరైనా చనిపోతే వారి ఇంటికి తోటి నటులు, బంధుమిత్రులు, ప్రముఖులు వెళ్లి సంతాపం తెలియజేస్తారు. కానీ పూనమ్ పాండే నివాసం వద్ద అలాంటిదేమీ జరగడం లేదు. పైగా దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు కూడా.. ఒకవేళ పూనమ్ నిజంగానే మరణిస్తే.. మరి ఆమె డెడ్ బాడీ ఎక్కడుంది ? అసలు గర్భాశయ క్యాన్సర్ కి ఆమె ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది ? ఇప్పటివరకు ఈ సమస్య గురించి ఆమె ఎక్కడ ప్రస్తావించలేదు కదా.. ఉన్నట్టుండి మరణించడం ఏంటి? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి..

మరొకవైపు ఇంత జరుగుతున్నా కూడా పూనమ్ పాండే మృతి పై ఆమె కుటుంబ సభ్యులు మౌనంగా ఉన్నారు. పైగా ఆమె తల్లి , చెల్లి ఇద్దరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.దీనికి తోడు మేనేజర్ కు పూనమ్ పాండే చనిపోయిందని ఫోన్ చేసి చెప్పింది కూడా ఆమె సోదరే.. ఆమె చెప్పిన తర్వాతే పూనమ్ పాండే చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు ఆమె మేనేజర్.. కానీ ఆ తర్వాత పూనమ్ కుటుంబ సభ్యుల ఫోన్ కలవడం లేదు.. ఇవన్నీ చూస్తుంటే పూనమ్ పాండే మరణించినట్లు వస్తున్నది కేవలం పబ్లిసిటీ స్టంటేనా? అనే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.

- Advertisement -

ఆమె క్యాన్సర్ సోకి చనిపోయింది అని చెబుతున్నారు కదా.. ఇంతకుముందు ఎప్పుడు ఈ విషయం గురించి చెప్పలేదు.. ఒకవేళ ఇప్పుడిప్పుడే క్యాన్సర్ సోకినా అంత సడన్గా చనిపోరు. అంతేకాదు చాలామంది సెలబ్రిటీలు కూడా క్యాన్సర్ బారినపడి తిరిగి కోలుకున్న విషయం తెలిసిందే.. అయితే పూనమ్ పాండే ఒక్కసారిగా సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయారని ప్రకటించడం నమ్మశక్యంగా లేదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.. దీన్ని బట్టి చూస్తే పబ్లిసిటీ కోసమే ఇదంతా చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల ఈమె ఒక ఇంటర్వ్యూలో తనకు సర్ ప్రైజ్ చేయడం ఇష్టమని, త్వరలోనే ఓ బిగ్ సర్ ప్రైజ్ ఇస్తానని చెప్పింది. అప్పుడు చెప్పిన బిగ్ సర్ప్రైజ్ ఇదేనా… అనే డౌట్స్ ఇప్పుడు వస్తున్నాయి.

నిజానికి ఓ సెలబ్రెటీ చనిపోతే… ఆడియన్స్ నుంచి వచ్చే కామెంట్స్ చాలా బాధ పెట్టేలా ఉంటాయి. ఆ సెలబ్రెటీని మిస్ అవుతున్నట్టు చాలా పెద్ద పెద్ద పోస్టులు చేస్తారు. కానీ, పూనమ్ పాండే విషయంలో మాత్రం ఇలాంటిది జరగడం లేదు. ప్రతి ఒక్కరు ఆమె డెత్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే… మరింత టైం పట్టొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు