Rajasekhar – Chiranjeevi: చిరంజీవికి థాంక్స్ చెప్పిన రాజశేఖర్.. వివాదం సద్దుమణిగినట్టేనా..?

Rajasekhar – Chiranjeevi

ఏ ఇండస్ట్రీలో నైనా సరే ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా కథతో మరొక హీరో సక్సెస్ కొట్టిన సందర్భాలు ఉంటాయి. ఒకవేళ అదే సినిమా ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి కొంతమంది హీరోలు తమ దగ్గరకు వచ్చిన కథ.. తమకు సెట్ కాదని భావించి ఫలానా హీరో కైతే బాగుంటుంది అనే సలహాలను కూడా దర్శక నిర్మాతలకు ఇచ్చిన హీరోలు ఉన్నారు. అలా మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడైన రాజశేఖర్ కు ఒక సినిమా కథను రెకమండేషన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా ఏంటో..? వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.

మలయాళం లో భారీ విజయాన్ని అందుకున్న “ఒరు సిబిఐ డైరీ కురిప్పు” సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి అనుకున్నారట. ఇందులో హీరో సిబిఐ ఆఫీసర్ గా నటిస్తారు. ఈ క్యారెక్టర్ రాజశేఖర్ చేస్తే బాగుంటుందని చిరంజీవి ఆయనను సూచించారట. నిజానికి ఈ సినిమా రైట్స్ ని కూడా రాజశేఖర్ కొనాలని, తానే హీరోగా నటించాలని కున్నాడట. కానీ అప్పటికే చిరంజీవి బావ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేశారని తెలిసి.. అక్కడి నుంచి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారట రాజశేఖర్.

అయితే కొంతకాలం తర్వాత అల్లు అరవింద్ ను రాజశేఖర్ కలుసుకున్నప్పుడు మాటల్లో.. “ఒరు సిబిఐ డైరీ కురిప్పు” అనే సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు ఈ సినిమా రైట్స్ నేను తీసుకున్నప్పటికీ నీతోనే చేస్తానని రాజశేఖర్ తో అల్లు అరవింద్ చెప్పారట. అంతేకాదు ఈ సినిమాలో నటిస్తారా అని రాజశేఖర్ ని అడగగా ఆ మాటతో ఆశ్చర్యపోయి.. వెంటనే ఒప్పేసుకున్నారట. అయితే ఈ సినిమా రైట్స్ అల్లు అరవింద్ దీసుకోవడం వల్ల… ఈ సినిమా చిరంజీవి తోనే చేస్తారని తాను అనుకున్నట్టు చెప్పారట. కానీ ఇంత మంచి క్యారెక్టర్ తనకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ అల్లు అరవింద్ తో తెలిపారు రాజశేఖర్.

- Advertisement -

అల్లు అరవింద్ ఈ విధంగా మాట్లాడుతూ.. ఈ సినిమా మొదట చిరంజీవితోనే చేద్దామనుకున్నాము కానీ అతని డేట్లు ఖాళీగా లేవని ఆలోచిస్తున్న సమయంలో చిరంజీవి స్వయంగా మీ పేరుని సజెస్ట్ చేశారు అంటూ తెలిపారట. మరొక సందర్భంలో చిరంజీవిని రాజశేఖర్ కలిసినప్పుడు ఈ సినిమా తనకు ఇప్పించినందుకు థాంక్స్ అంటూ తెలిపారట. అలా డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో 1988లో న్యాయం కోసం సినిమా సక్సెస్ మీట్ లో ఈ సినిమా చేయడం వెనుక అసలు కథని తెలియజేశారు రాజశేఖర్.

ఇకపోతే కొన్ని విషయాలలో రాజశేఖర్, చిరంజీవి మధ్య వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు ఈ వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. మరి ఈ విషయం తెలిసి ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణిగాయా అంటూ కామెంట్లు చేస్తుండగా. మరికొంతమంది ఇది ఎప్పుడో 1988లో జరిగింది. వారి మధ్య గొడవలు అలాగే ఉన్నాయి.. కానీ బయటపెట్టారు అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు