Dhanya Balakrishna: వారికి క్షమాపణ చెప్పిన బ్యూటీ.. ఆ రోజు అసలేం జరిగిందంటే..?

Dhanya Balakrishna

తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకుంది ధన్య బాలకృష్ణ.. ఇటీవలే రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్రలో నటించి అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ చిత్రానికి రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కొద్ది రోజులు ముందే.. హీరోయిన్ ధన్య బాలకృష్ణకు సంబంధించి ఒక పాత వివాదాన్ని సోషల్ మీడియాలో తమిళ ప్రేక్షకులు తెలుపుతూ ఈమెను ట్రోల్ చేస్తున్నారు.

గతంలో ధన్య బాలకృష్ణ చేసినటువంటి పాత కామెంట్లు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చి పెట్టేలా కనిపిస్తున్నాయి.. తమిళ ప్రజల గురించి ఈమె అప్పట్లో ఒక తీవ్రదుమారాన్ని చేసే విధంగా ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తన సినిమా విడుదలకు ముందు ఈమె చేసినటువంటి పాత వ్యాఖ్యలను సైతం ఖండిస్తూ రజనీకాంత్ ఐశ్వర్య.. అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తూ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది.. ఇంతకీ అసలు వివాదం ఏమిటి? వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

2012 లో చెన్నై సూపర్ కింగ్స్ అర్హత సాధించిన తర్వాత ధన్య ఫేస్ బుక్ లో ఇలా పోస్ట్ చేసింది.. తమిళ ప్రజల గురించి చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టులో చెన్నైకి చెందిన ప్రజలు విద్యుత్ కోసం, నీటి కోసం బెంగళూరు పైన ఆధారపడుతున్నారు.. కానీ బెంగళూరు ని సందర్శించే సమయంలో వారు నగరంలో చెత్తను వేస్తున్నారంటూ ఆమె విమర్శించింది. దీంతో అప్పటి వివాదాన్ని ఇప్పుడు లాల్ సలామ్ సినిమా విడుదల ముందు తెరపైకి తీసుకువచ్చారు.

- Advertisement -

అయితే గతంలో ఈ విషయంపై ఏమి క్షమాపణలు చెప్పినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని తీసుకురావడంతో.. అసలు విషయాన్ని చెప్పేసింది ధన్య బాలకృష్ణ.. తన టేబుల్ పై భోజనం పెట్టి తన వృత్తిపైన తాను చేస్తున్న ప్రమాణం ఇది.. ఇప్పుడు చలామణిలో ఉన్న ఈ ప్రకటన తాను చేసింది కాదని.. అది జరిగిన 12 సంవత్సరాల క్రితమే తాను స్పష్టంగా తెలియజేశాను అని .. తమిళ ప్రేక్షకులను తాను అలా అనలేదని.. అది ఎవరో కావాలనే తన మీద చేసిన కుట్రగా అనిపిస్తోంది అంటూ తెలిపింది.. అయితే అది తాను కాదని నిరూపించడానికి తన దగ్గర ఆధారాలు లేవని.. దీని వల్ల తాను, తన కుటుంబ సభ్యులు చాలా బెదిరింపులకు గురయ్యాము.. వారిని రక్షించుకునేందుకు అప్పట్లో తప్పు చేయకపోయినా సారీ చెప్పానని తెలిపింది. ఈ విషయం విని అభిమానులు చాలా ఆశ్చర్యపోదుతున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు