Allu Bobby: ఒక్క సినిమాతోనే సైలెంట్ అయిన అల్లు బాబీ.. నెక్స్ట్ ఏంటి..?

Allu Bobby

టాలీవుడ్ లో అల్లు ఫ్యామిలీ నుంచి హీరోలుగా అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే కొనసాగుతున్నారు. అల్లు అరవింద్ ఒకవైపు నిర్మాతగా ఉంటూనే.. ఆహా ఓటీటీ ని కూడా నడుపుతున్నారు. ఇక అల్లు అరవింద్ మరొక వారసుడు బాబి.. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా వరుణ్ తేజ్ నటించిన గని సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వగా.. ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. గతంలో ఎన్నో బిజినెస్ లలో బాబి తన హవా కొనసాగించారు.

అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరు నటన వైపు ఉండడంతో నిర్మాణం వైపు వీళ్ళు పెద్దగా దృష్టి పెట్టలేకపోయారు. దీంతో వ్యాపార రంగంలో బాబీకి మంచి అనుభవం ఉండడంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అల్లు అరవింద్ భావించి తనను కూడా నిర్మాతగా చేసినప్పటికీ.. ఒక్క సినిమా తోనే గట్టి షాక్ తగిలింది.. భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఆ సినిమాకి పెట్టిన ఖర్చు కూడా తిరిగి రాలేదు. అయితే ఆ తర్వాత మళ్లీ ఇంత వరకూ బాబి నిర్మాతగా సినిమాలు ప్రకటించలేదు.

చాలా కాలం మీడియాకు కూడా దూరంగా ఉన్న అల్లు బాబీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు అలా కూడా యాక్టివ్ గా లేరు.. దీంతో అల్లు బాబీ ఏం చేస్తున్నారు అనే సందేహం అల్లు అభిమానులలో మొదలైంది. ఇంత గ్యాప్ రావడంతో ఈయన నిర్మాణానికి దూరం అయ్యారా అనే సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ విషయం పైన అల్లు బాబి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి.

- Advertisement -

ప్రస్తుతం అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ని మెయింటైన్ చేస్తూ అలాగే గీత ఆర్ట్స్-2 బ్యానర్ పైన చిన్న చిన్న సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా బన్నీనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అరవింద్ తదనంతరం భవిష్యత్తులో ఈ రెండు సంస్థలను చూసుకోవాల్సింది తన ముగ్గురు కుమారులే కాబట్టి అటు నటుడుగా అల్లు అర్జున్ అల్లు శిరీష్ బిజీగా ఉండగా ఈ నేపథ్యంలోనే వ్యాపార రంగంలో అనుభవం ఉన్న అల్లు బాబీనే.. ఈ సంస్థలను రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్లేలా అల్లు బాబీని మార్చబోతున్నట్లు సమాచారం. మరి అల్లు బాబి నుంచి ఏదైనా బ్లాక్ బాస్టర్ సినిమా వస్తుందేమో చూడాలి మరి.

Check out Filmify Telugu for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు