Pooja Hegde : చేతిలో సినిమాల్లేవ్.. పోజులివ్వడం తప్ప ఇంకేం పని.!

టాలీవుడ్ లో బుట్ట బొమ్మ గా ఫేమస్ అయిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చినా తన గ్లామర్ షో తో ఆకట్టుకుని పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టింది. ఒక్క పవన్ కళ్యాణ్ మినహా అందరు టాప్ హీరోలతో నటించిన ఈ భామ లాక్ డౌన్ తర్వాత మాత్రం ఒక్కసారిగా డౌన్ అయింది. అప్పటివరకు నెంబర్ వన్ రేసులో ఉన్న ఈ భామ వరుస ప్లాపులతో సతమతమవగా, దానికి తోడు బాలీవుడ్ పై మోజుతో వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంది.

అయినా టాలీవుడ్ లో అప్పుడప్పుడూ షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వస్తూ సందడి చేసింది. కానీ ఈ భామకు తెలుగు డైరెక్టర్లు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వడం లేదు. ఎప్పుడైతే గుంటూరు కారం నుండి రిజెక్ట్ అయిందో అప్పుడే బుట్టబొమ్మకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఆ తర్వాత హిందీలో కూడా మరో సినిమా చేయలేదు. అందుకే ఇంస్టాగ్రామ్ లో ఫోటో షూట్లు చేసుకుంటూ గడీస్తుంది.

లేటెస్ట్ గా రెడ్ రైడింగ్ హుడ్ అంటూ ఎర్రటి రంగులో నైట్ మోడ్ లో ఫోటో షూట్ చేసి తన అందాలను ఆరబోసింది. చూసేందుకు కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా, సినిమా ఛాన్సులకోసమే ఈ తంతంగమంతా అని అనిపించక మానదు. అయినా యాక్టింగ్ విషయంలో కొంచెం నెగిటివిటి ఉన్న పూజా కి ఇక తెలుగులో పెద్ద సినిమాల్లో ఛాన్సులు అంటే కష్టమే అని చెప్పాలి. వీలైతే మీడియం రేంజ్ హీరోలు, ఇంకా చిన్న హీరోల సినిమాల్లో నటిస్తేనే టాలీవుడ్ లో నిలదొక్కుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక చిన్న హీరోల సినిమాల్లో అంటే రెమ్యూనరేషన్ కూడా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు