Priyadarshi : సుహాస్ ని మించి బిజీ అవుతున్న ప్రియదర్శి..!

Priyadarshi : టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ కమెడియన్లలో ఒకరు ప్రియదర్శి పులికొండ. ఇక ఇప్పుడు హీరోగానూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఎనిమిదేళ్ల కింద పెళ్లి చూపులు సినిమాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మొదటి సినిమాతోనే ఓ రేంజ్ కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. జాతిరత్నాలు వంటి సినిమాల్లో అయితే ప్రియదర్శి కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. ఇక కొన్ని సినిమాల్లో ప్రియదర్శి సినిమాలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అందులో కామెడీకి కొదవ ఉండదు అనే అభిప్రాయం పబ్లిక్ లో క్రియేట్ చేశాడు. రీసెంట్ గా ‘సేవ్ ది టైగెర్స్’ అనే వెబ్ సిరీస్ తో ప్రియదర్శి అందరిని ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్ కి ఇంకో ఇద్దరు హీరోలు ఉన్నా కూడా ప్రియదర్శి మెయిన్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక హీరోగా మారి చేసిన మల్లేశం, బలగం లాంటి చిత్రాలు ప్రియదర్శికి హీరోగా మంచి బ్రేక్ ఇచ్చాయి. ఈ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా ప్రియదర్శికి నటుడిగా మంచి పేరుని తెచ్చి పెట్టాయి. ఇక బలగం సినిమాలో ప్రియదర్శి తనదైన కామెడీతో అందరిని నవ్విస్తూనే క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించాడు.

వరుస సినిమాలతో బిజీ..

ఇక బలగం మూవీ తర్వాత ప్రియదర్శికి హీరోగా అవకాశాలు పెరుగుతున్నాయి. పలు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే, హీరోగా వరుస సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఇక ఆ మధ్య కాలంలో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయ్యింది. తాజాగా హనుమాన్ మూవీ నిర్మాతతో నభా నటేష్, ప్రియదర్శి జోడీగా “డార్లింగ్” అనే మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయి ఆకట్టుకుండుంది. అశ్విన్ రామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు సెట్స్ పైన ఉండగానే, రానా దగ్గుబాటి సొంత ప్రొడక్షన్ లో ప్రియదర్శి హీరోగా ఒక సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియదర్శి చేతిలోనే హీరోగానే మూడు సినిమాలు ఉన్నాయట. ఇక ఓ వైపు స్టార్ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూన్న ప్రియదర్శికి ఈ మూడు సినిమాలు హీరోగా బ్రేక్ ఇచ్చేలాగే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

సుహాస్ కంటే బిజీ?

ఇక ప్రియదర్శి ఇప్పుడు నటుడు సుహాస్ కంటే ఎక్కువ బిజీ అయ్యాడని చెప్పొచ్చు. సుహాస్ కూడా కమెడియన్ గా, హీరో ఫ్రెండ్ పాత్రలతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా మంచి సినిమాలు చేస్తూ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇప్పటికే కమెడియన్ సుహాస్ వరుస హిట్స్ తో హీరోగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ప్రియదర్శి సుహాస్ ని మించి వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఎందుకంటే సుహాస్ హీరోగా మారాక ఇతర హీరోల సినిమాల్లో చెయ్యట్లేదు. కానీ ప్రియదర్శి వేరేహీరోల సినిమాల్లోనూ మంచి పాత్రల్లో నటిస్తూనే హీరోగా బిజీ అవుతున్నాడు. ఇక హీరోగా సక్సెస్ అయ్యేదాన్ని బట్టి ముందుముందు సుహాస్ లాగే ప్రియదర్శి కూడా కమెడియన్ గా సినిమాలు తక్కువ చేయొచ్చు. ఇక టాలీవుడ్ లోబడ్జెట్ కథలకి ప్రస్తుతం హీరోల కొరత ఉంది. కొత్త దర్శకులు డిఫరెంట్ కథలతో తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేయాలని అనుకున్నప్పుడు ఫేమ్ ఉన్న హీరోలు కనిపించడం లేదు. ఆ లోటుని ప్రియదర్శి లాంటి వారు భర్తీ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి రాబోయే సినిమాలతో ప్రియదర్శి ఎంతవరకు ఆకట్టుకొంటాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు