Suhas : ఆ సినిమాకి పని చేసింది పది రోజులే.. అందుకే?

Suhas : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సుహాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో చిన్న షార్ట్ ఫిలిమ్స్ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారి యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో కుర్ర హీరో సుహాస్ కొత్త సినిమా ఏదైనా వస్తోందంటే ఖచ్చితంగా దాని తాలూకు టాక్ బిజినెస్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఉంటుంది. బడ్జెట్ తక్కువైనా సరే మంచి కథాబలం ఉన్న సినిమాలు ట్రై చేస్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇక లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ తో వచ్చి మంచి హిట్టు కొట్టిన సుహాస్ ఈ ఇయర్ ఫిబ్రవరి లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమాతో వచ్చి మరో సక్సెస్ కొట్టాడు. అంతే కాకుండా హీరోగా హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా సుహాస్ నటించిన శ్రీ రంగ నీతులు సినిమా రిలీజ్ అయింది. కానీ సుహాస్ నటించిన సినిమా రిలీజ్ అయిందని కూడా చాలా మందికి తెలియని పరిస్థితి వచ్చింది. ప్రమోషన్ల పరంగా ఈ చిత్ర యూనిట్ అంతగా శ్రద్ధ తీసుకోలేదు. శ్రీ రంగ నీతులు ట్రైలర్ వచ్చి కూడా చాలా రోజులయ్యింది. అయితే హ్యాట్రిక్ చిత్రాల హీరో సుహాస్ కూడా లైట్ తీసుకుంటాడని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు.

అనుకున్నంత రాని రెస్పాన్స్..

ఇక సుహాస్(Suhas) నటించిన ఈ సినిమాలో బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్, కంచరపాలెం కార్తీక్ రత్నం కూడా రెండు ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే ఫిమేల్ లీడ్ గా రుహాణి శర్మ నటించింది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గరి నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే దక్కించుకోలేకపోయింది. ఇదిలా ఉండగా ఈ సినిమా రూరల్ ఏరియాల్లో కాకుండా ప్రధాన నగరాల్లో మాత్రమే రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. అయితే మేకర్స్ ఎంత లైట్ తీసుకున్నా, సుహాస్ లాంటి క్రేజీ నటుడు ఉన్నప్పుడు సరిగా వాడుకోవడం తెలియాలి. కనీసం చిత్ర యూనిట్ తో కలిసి ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని నెటిజన్లు పలు విధాలుగా మాట్లాడుతున్నారు. అయితే దీనిపై అసలు క్లారిటీ తాజాగా సుహాస్ ఇచ్చాడు.

పది రోజులే పని..

తాజాగా సుహాస్ నటించిన మరో సినిమా ప్రసన్న వదనం గురించి తాజాగా మెమర్స్ తో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూ లో తన సినిమాల గురించి మాట్లాడే క్రమంలో ఈ సినిమా గురించి ప్రస్తావించాడు. సుహాస్ మాట్లాడుతూ తాను శ్రీ రంగ నీతులు లో హీరో కాదని, ఆ సినిమాలో ఉండే మూడు మెయిన్ క్యారెక్టర్లలో తనది కూడా ఒకటని అన్నాడు. ఇక ఆ సినిమా రైటర్ పద్మభూషణ్ కంటే ముందు కమిట్ అయిన సినిమా అన్నాడు. ఇక ఈ సినిమా కోసం సుహాస్ కేవలం పది రోజులు మాత్రమే పని చేసాడట. ఆ పది రోజుల షెడ్యూల్ లో తన పార్ట్ కి సంబంధించిన షూట్ అయిపోయిందట. అయితే సుహాస్ మెయిన్ లీడ్ కాదని ఈ సినిమాకు ప్రమోట్ చేయలేదని పలువురు ట్రోలింగ్ చేస్తున్నారు. పైగా ఆ సినిమా రిలీజ్ అవుతున్న రోజే వేరే సినిమా ప్రెస్ మీట్ పెట్టడం మరీ వింతగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సినిమాలో క్యారెక్టర్ అయితే చేశాడు కాబట్టి, దాన్ని ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లేందుకు పబ్లిసిటీలో భాగమవ్వాలి. కానీ సుహాస్ మాత్రం ఈ సినిమాలో తాను మెయిన్ లీడ్ కాదని ప్రమోట్ చేయలేదని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం చిత్ర దర్శక నిర్మాతలే లైట్ తీసుకుంటే సుహాస్ మాత్రం ఏం చేస్తాడని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు