Akshay Kumar : బాలీవుడ్ ఖిలాడీ ఇకనైనా మారతాడా?

Akshay Kumar : బాలీవుడ్ స్టార్ ఖిలాడీ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ, ఖాన్ త్రయానికి గట్టి పోటీ ఇచ్చిన అక్షయ్ కొన్నేళ్ల నుంచి ఓ మోస్తరు సక్సెస్ కూడా లేక ఇబ్బంది పడుతున్నాడు. దాదాపుగా ఇప్పుడు బాలీవుడ్లో ఫ్లాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు అక్షయ్ కుమార్.వా మధ్య ఓ ఇంటర్వ్యూ లో డబుల్ హ్యాట్రిక్ ప్లాప్ లు అందుకున్నానని అంగీకరిస్తూ, ప్రేక్షకులని మెప్పించడానికి మంచి సినిమాలు తీయడానికి ట్రై చేస్తున్నానని చెప్పిన అక్షయ్ మళ్ళీ అదే రొట్ట సినిమాలతో వస్తున్నాడు. ఒకప్పుడు అక్షయ్ సినిమా వచ్చిందంటే చాలు ఆ సినిమా చిన్నదైనా పెద్దదైనా, ప్రేక్షకులని మినిమం ఎంటర్టైన్ చేస్తాడు అని టాక్ ఉండేది. కానీ ఇప్పుడు అక్షయ్ సినిమా అంటే ఆ రోత సినిమా చూడలేము అనే స్థాయికి పడిపోయాడంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. తాజాగా యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి తాను చేసిన ‘బడేమియా చోటేమియా’ తో రంజాన్ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తో తన హిట్ కరువును తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐతే విడుదలకు ముందే చాలా నెగెటివిటీని ఎదుర్కొన్న ఈ సినిమా విడుదలయ్యాక అందరూ ఊహించినట్టే దారుణమైన టాక్‌ను తెచ్చుకుంది.

పాత చింతకాయ పచ్చడి వద్దు..

అయితే అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియా చోటే మియా కి ఇలా మార్నింగ్ షోలు పడ్డాయో లేదో, డిజాస్టర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. ఇక ట్విట్టర్లో ‘డిజాస్టర్’ అనే హ్యాష్ ట్యాగ్ నిన్న టాప్‌లో ట్రెండ్ అయింది. ఆ హ్యాష్ ట్యాగ్‌ను క్లిక్ చేస్తే ‘బడేమియా చోటేమియా’ సినిమాకు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. భారీగా ఖర్చు పెట్టి యాక్షన్ సన్నివేశాలను స్టైల్‌గా, గ్రాండ్‌గా తీశారే తప్ప సినిమాలో విషయం లేదన్నది ప్రేక్షకులు చెబుతున్న మాట. ఇక ఇదే ఫార్మాట్లో బాలీవుడ్ లో కుప్పలు కుప్పలుగా సినిమాలు వచ్చాయని, లేటెస్ట్ గా రిలీజ్ అయిన టైగర్ 3, ఫైటర్, అంతకు ముందు జవాన్, పఠాన్ ఇవే నేపథ్యంలో తెరకెక్కడం జరిగింది. ఇక బడే మియా చోటే మియా అయితే ఏ కొత్తదనం లేదని అక్షయ్, వీళ్ళ స్టార్ డమ్ కూడా సినిమాని కాపాడలేకపోయిందని ప్రేక్షకులంటున్నారు. మొత్తానికి అక్షయ్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ పడుతోందనడంలో సందేహం లేనట్లే కనిపిస్తోంది. కనీసం ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా దక్కేలా లేవని అనిపిస్తుంది.

ఇకనైనా అక్షయ్ మారతాడా?

అయితే ఒకప్పుడు తన సినిమాలతో హిట్ల మీద హిట్లు కొట్టిన అక్షయ్ (Akshay Kumar) అదే విధంగా ప్లాపుల మీద ప్లాపులు అందుకుంటున్నాడు అంటున్నారు జనాలు. ఆ మధ్య OMG2 తో ఓ మోస్తరు హిట్ అందుకున్నా, మళ్ళీ అదే ధోరణిలో సినిమాలు వస్తున్నాయి. ఇది ఇలాగే సాగితే అక్షయ్ కుమార్ మార్కెట్ పడిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు ట్రేడ్ విమర్శకులు. ఇక ఆ మధ్య బాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ గా మారిన అక్షయ్ కుమార్ మళ్ళీ ఆ రోజుల్ని తీసుకురావాలని, రౌడీ రాథోడ్ లాంటి సినిమాలు కాకపోయినా, OMG, బేబీ, జాలి LLB లాంటి మంచి కథాబలం ఉన్న చిత్రాల్లో అక్షయ్ మళ్ళీ కనిపించాలని బాలీవుడ్ ఖిలాడీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి తాజాగా వచ్చిన డిజాస్టర్ అర్ధం చేసుకుని ఇకనైనా మారతాడా? మళ్ళీ ప్రేక్షకుల కి నచ్చేలా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇక అక్షయ్ కుమార్ ప్రస్తుతం సర్ఫిరా, సింగం అగైన్, స్కై ఫోర్స్, వెల్కమ్ టు ది జంగిల్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు