Vithika Sheru: మా అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు.. ఎమోషనల్ అవుతున్న నటి..!

Vithika Sheru..గత కొన్ని సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీ ని పట్టి పీడిస్తున్న పదం ఏమిటంటే క్యాస్టింగ్ కౌచ్.. ఇప్పటికే ఈ విషయం పైన చాలామంది హీరోయిన్స్ మాత్రమే కాకుండా బుల్లితెర యాక్టర్స్ కూడా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎవరో ఒకరు తమకు ఎదురైన చేదు సంఘటనలను కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ కూడా తన సినీ కెరియర్ లో ఎదురైన ఒక చేదు అనుభవం గురించి తెలియజేస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు వితికా షేర్.. ఈమె పలు చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటించింది.

Vithika Sheru: My mother asked for commitment before.. Actress getting emotional..!
Vithika Sheru: My mother asked for commitment before.. Actress getting emotional..!

బిగ్ బాస్ ఆఫర్..

తాజాగా వితికా షేర్ ఒక ఇంటర్వ్యూలో తన తల్లి ముందే కమిట్మెంట్ గురించి అడిగారంటూ తెలియజేసి అందర్నీ షాక్ కి గురిచేసింది.. తెలుగులో చేసింది ఈ ముద్దుగుమ్మ తక్కువ సినిమాలే అయినా ఒక మోస్తారు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది.. ముఖ్యంగా హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో ఇద్దరూ కూడా బిగ్బాస్ లో చేరి మరింత పాపులారిటీ అందుకున్నారు.

ఆడిషన్ కి వెళ్తే..

వితిక చిన్న వయసులోనే కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2008లో వచ్చిన అంతు ఇంతు ప్రీతి బంతు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.. ఇక టాలీవుడ్ లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే చిత్రంలో కూడా ఒక పాత్రలో హీరోయిన్గా నటించింది.. మొట్టమొదటిసారిగా సినిమా అవకాశాల కోసం ఆడిషన్ కు వెళ్ళినప్పుడు తన కలర్ తక్కువగా ఉందంటూ చాలా మంది రిజెక్ట్ చేశారని కూడా వెల్లడించింది.. తెలుగు అమ్మాయి అని చెప్పగానే చాలామంది రిజెక్ట్ చేశారంటూ కూడా వెల్లడించింది. పదహారేళ్ళ వయసులో తన తల్లితో కలిసి ఒక ఆడిషన్ కు వెళ్లానని.. అలా ఆడిషన్ కి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ పూర్తి అయిన తర్వాత తన తల్లితో మాట్లాడాలని పిలిపించారట.

- Advertisement -

తల్లి ముందే కమిట్మెంట్..

తన తల్లి తోనే మీ కూతురు హీరోయిన్ కావాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పారట.. అయితే ఈ విషయం తన తల్లికి అర్థం కాకపోవడంతో వెంటనే తనను పిలిచిందని.. వెళ్ళిన తర్వాత ఏదో కమిట్మెంట్ అంటున్నారు అని తన తల్లి చెప్పగా.. అది తనకు అర్థమయిందని దీంతో వెంటనే అక్కడ నో అని చెప్పి వెళ్ళిపోయాను అంటూ తెలియజేసింది వితికా షేర్.. అవకాశాలు రాకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచమైన పనికి నేను దిగజారిననీ ముఖానే చెప్పేసి వచ్చేసిందట వితికా షేర్..

వరుణ్ సందేశ్ తో పెళ్ళి..

ఇక తర్వాత హీరో వరుణ్ సందేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వరుణ్ సందేశ్ కూడా అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు ..కానీ సరైన సక్సెస్ అందుకోలేదని చెప్పాలి. ఏదేమైనా కాస్టింగ్ కౌచ్ పై స్పందించి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని యూట్యూబ్లో షేర్ చేస్తూ వస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు