Daggupati Rana: ప్రభాస్ అంటే ఎవరు.?

Daggupati Rana: లీడర్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు దగ్గుబాటి రానా. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సరైన నటుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ గా థియేటర్ వద్ద వర్కౌట్ కాకపోయినా కూడా రానాకి మాత్రం మంచి పేరు తీసుకువచ్చింది. స్టిల్ ఇప్పటికీ ఈ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాను మళ్ళీ రిలీస్ కూడా చేస్తున్నారు. ఇకపోతే చాలా తక్కువ మంది మాత్రమే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేయడం మొదలుపెడతారు. అలా చేసిన వాళ్లలో దగ్గుబాటి రానా ఒకరు.

చాలా తక్కువ టైంలోనే అన్ని భాషల్లో మంచి గుర్తింపును సాధించుకున్నాడు దగ్గుబాటి రానా. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి సంచలనం సృష్టించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్ ను రానా ప్లే చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా గురించి బొంబాయిలో చెప్తున్నప్పుడు బాహుబలి క్యారెక్టర్ ను ఎవరు చేస్తున్నారు అని ఒక వ్యక్తి అడిగారట దానికి సమాధానంగా ప్రభాస్ చేస్తున్నాడు అని చెప్పాడంట రానా. అప్పుడు అవతల వ్యక్తి “హూ ఇస్ ప్రభాస్” అని అన్నాడట. ఆ మాటకు రానా షాక్ అయ్యాడని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలానే చాలా ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకున్నాడు రానా.

బొంబాయిలో ఆ సదరు వ్యక్తి నాకు సీనియర్ హీరోస్ లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడున్న హీరోస్లో చీనుస్ హస్బెండ్ మాత్రమే తెలుసు అని అన్నాడంట. ఆ మాట అనగానే రాను షాక్ అయ్యాడు అంట. ఇంతకీ విషయం ఏమిటంటే మహేష్ బాబు వైఫ్ నమృతా శిరోద్కర్ ను బాలీవుడ్ లో చీనూస్ అంటారంట. అయితే తన హస్బెండ్ అయినా మహేష్ బాబు తెలుసు అని చెప్పాడంట అవతలి వ్యక్తి. అయితే దీనికి రానా షాక్ అవుతూ మహేష్ బాబు మీకు ఇలా తెలుసా అని అనుకున్నాడట. అయితే ఆ తర్వాత వస్తారా బాబు ఓ 12 మంది హీరోలు అని మనసులో అనుకున్నాడట రానా. అలానే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు బాలీవుడ్ లో రూల్ చేస్తున్నారు అని చెప్పవచ్చు.

- Advertisement -

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, విజయ్ దేవరకొండ వీళ్ళ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పొచ్చు. ఏదేమైనా రానా ఆరోజు అనుకున్నది నేటికి నెరవేరిందని చెప్పొచ్చు. ఈ సినిమాలుకి అంతగా ఆదరణ రావడానికి రాజమౌళి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాహుబలి సినిమా తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసింది.రానా దగ్గుబాటి చాలా తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు